వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
హైదరాబాద్: గతంలో కన్నా ఎక్కువసీట్లు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీని అడుగుతామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయాధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయన ఆదివారం కొద్దిసేపువిలేకరులతో మాట్లాడారు.
తమ బలంపెరిగిందని, పెరిగిన బలం ఆధారంగానే తెలుగుదేశం పార్టీని టికెట్లు అడుతామని, తమ బలమేమిటో తమకు తెలుసునని, పార్టీ రాష్ట్ర శాఖ నివేదికను బట్టి బలాన్నిఅంచనా వేశామని ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటువిషయంలో రెండో రాష్ట్రాల పునర్విభజన కమీషన్‌అంశం తమ పరిశీలనలో లేదని ఆయన స్పష్టం చేశారు. రెండో రాష్ట్రాల పునర్విభజన కమీషన్‌విషయంలో తలో మాట మాట్లాడుతున్నారని, ఇదంతా రాజకీయ లబ్ధి కోసమేనని ఆయన అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!