• search

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    కరాచీ: రోమాంచిత కరాచీ వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లో భారత్‌విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠతో సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ ఐదు పరుగుల తేడాతోవిజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడువికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది. పాకిస్థాన్‌ ఎనిమిదివికెట్లు కోల్పోయి 344 పరుగులు చేసింది.

    ఆశిష్‌ నెహ్రా వేసిన చివరి ఓవర్‌ చివరి బంతిని మొయిన్‌ఖాన్‌ గాలిలోకి లేపాడు. దీన్ని జహీర్‌ ఖాన్‌అందుకోవడంతో భారత్‌ విజయాన్ని చేజిక్కించుకుంది. ఒకానొక సమయంలో పాకిస్థాన్‌విజయం ఖాయమనిపించింది. అయితే జహీర్‌ఖాన్‌ బౌలింగ్‌లో మాలిక్‌ కొట్టిన బంతిని కైఫ్‌ అద్భుతంగా క్యాచ్‌ పట్టడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. పాకిస్థాన్‌ మొదటి రెండువికెట్లను త్వరగానే కోల్పోయింది. కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌, యోహానన్‌ అద్భుతమైన బ్యాటింగ్‌ ప్రతిభను ప్రదర్శించడంతో మ్యాచ్‌ ఒక్కసారిగా మలుపు తిరిగినట్లయింది. ఇంజమామ్‌ అద్భుతమైనసెంచరీని నమోదు చేశాడు. 104 బంతుల్లో 122 పరుగులు చేశాడు. యోహానన్‌ 67 బంతుల్లో 75 పరుగులు చేశాడు.వీరిద్దరూ అవుటైన తర్వాత భారత బౌలర్లు చాకచక్యంతో బౌలింగ్‌ చేసి భారత్‌కువిజయాన్ని అందించారు. జహీర్‌ ఖాన్‌ మూడు వికెట్లు, మురళీ కార్తిక్‌ రెండువికెట్లు, నెహ్రా, సెహ్వాగ్‌, బాలాజీ ఒక్కటేసి వికెట్లు తీసుకున్నారు.

    మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలుత ధాటిగానే ఆడింది. షోయబ్‌అక్టర్‌ వైడ్స్‌, నో బాల్స్‌తో చాలా పరుగులు ఇచ్చుకున్నాడు. సచిన్‌ 28 పరుగులకు అవుట్‌ కాగాసెహ్వాగ్‌ 57 బంతుల్లో 79 పరుగులు చేసి భారత్‌ భారీ స్కోర్‌కు పునాది వేశాడు. గంగూలీ 45 పరుగుల చేయగా,కైఫ్‌ 46 పరుగులు చేశాడు. రాహుల్‌ ద్రావిడ్‌ ఒక్క పరుగుతోసెంచరీ మిస్సయ్యాడు. ద్రావిడ్‌ 99 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్దఅక్టర్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అక్టర్‌, సమీలు రెండేసివికెట్లు తీసుకున్నారు. పాకిస్థాన్‌ 38 ఎక్స్‌ట్రాలు ఇవ్వడం భారత్‌కు కలిసి వచ్చింది. పాకిస్థాన్‌ఫీల్డింగ్‌ కూడా బాగా లేదు. దీన్ని భారత బ్యాట్స్‌మెన్‌ చక్కగా వినియోగించుకున్నారు.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more