హైదరాబాద్: రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు నక్సలైట్లు మృతి చెందారు. వరంగల్ జిల్లాలో ఇద్దరు, కరీంనగర్ జిల్లాలో ఇద్దరు నక్సలైట్లు పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందినట్లు సమాచారం.
వరంగల్ జిల్లా చెల్పూర్ గ్రామం వద్ద కూంబింగ్ జరుపుతున్న పోలీసులకు నక్సల్స్ ఎదురుపడ్డారు. లొంగిపోవాల్సిందిగా పోలీసులు చేసిన హెచ్చరికను బేఖాతరు చేస్తూ నక్సల్స్ కాల్పులు జరిపారు. దాంతో పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ ఎదురుకాల్పుల్లో సుగుణక్క అనే మహిళా నక్సలైట్‌తో పాటు మరో గుర్తు తెలియని నక్సల్ హతమైనట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్ జిల్లా మల్హర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్లు చనిపోయారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి