• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|

కాంగ్రెస్‌ కల్లబొల్లి కబుర్లు చెప్పిందే తప్ప మహిళల కోసం ఏమీ చేయలేదని చంద్రబాబు అన్నారు. ప్రతి కార్యక్రమాన్ని మహిళలను దృష్టిలో ఉంచుకుని తాము అమలు చేశామని ఆయన చెప్పారు. బడుగు, బలహీన వర్గాల కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో చేసిందని ఆయన చెప్పారు. అందుకు సంబంధించిన గణాంకాలను కూడా ఆయన తెలియజేశారు. తెలుగుదేశం వచ్చే కాలంలో కూడా పేదల అభివృద్ధికి కృషి చేస్తుందని ఆయన చెప్పారు. రేషన్‌ కార్డులు, ఇళ్ల స్థలాలు, మొదలైనవి ఏవి రాకున్నా మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుంది కాబట్టి అవి అందని వారికి అందిస్తామని ఆయన చెప్పారు. ఆదరణ ద్వారా ఎంతో మందికి సహాయం చేశామని ఆయన చెప్పారు. పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, అందుకే తాము పేదల కోసం అనేక కార్యక్రమాలను చేపట్టామని ఆయన చెప్పారు.

కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు అవకాశవాద రాజకీయాలతో రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం వాజ్‌పేయి ప్రభుత్వానికి సహకరించామని ఆయన చెప్పారు. ప్రపంచ దేశాలకు ధీటుగా మన దేశం ముందుకు పోతోందని ఆయన అన్నారు. ఆర్థిక వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. పేదరిక నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని ఆయన చెప్పారు. గోదావరి నీళ్లు ఖమ్మం జిల్లాకు రావాలంటే కేంద్రంలో ఎన్‌డిఎ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలని ఆయన అన్నారు. గోదావరి నీళ్లను మన రాష్ట్ర ప్రయోజనాలకు వాడుకుందామని, గోదావరి నీళ్లను వాడకంలోకి తెస్తే తెలంగాణ ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని, అందుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు.

కళ్లుంటే చూడగలిగితే కాంగ్రెస్‌ సోనియా గాంధీకి అభివృద్ధి కనిపిస్తుందని, రోడ్‌ షోల సందర్భంగా తాను ప్రయాణిస్తున్న రోడ్లను పరిశీలించినా ఆ విషయం సోనియాకు అర్థమవుతుందని ఆయన అన్నారు. విదేశాల్లో పుట్టినవారు ఈ దేశ ప్రధాని కావడానికి వీల్లేదని, ఈ దేశ ప్రధానిగా సోనియాను ఒప్పుకోవద్దని ఆయన అన్నారు. సోనియా వల్ల నష్టం తప్ప లాభం లేదని కాంగ్రెస్‌ నాయకులు గుర్తించాలని ఆయన అన్నారు.

ఓట్ల కోసం ఉచిత విద్యుత్‌ అందిస్తామని కాంగ్రెస్‌ మాటలు చెబుతోందని, తాము ఎప్పుడూ ప్రజలను మోసం చేసే మాటలు చెప్పలేదని ఆయన అన్నారు. తీవ్రవాదులు లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారని, తీవ్రవాదులు ఓటేయకూడదని ప్రజలకు చెబుతున్నారని, తుపాకులు చూపించి తాము చెప్పేది వినమంటున్నారని ఆయన అన్నారు. గ్రామాల్లోని ప్రజలు తిరుగుబాటు చేస్తుంటే నక్సలైట్లు మరింత రెచ్చిపోయి తమ కార్యకర్తలను, నాయకులను హత్య చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ తీవ్రవాదులతో కుమ్మక్కయి తెలుగుదేశం నాయకులను చంపిస్తోందని ఆయన విమర్శించారు. టిఆర్‌ఎస్‌ తీరును కూడా ఆయన విమర్శించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more