For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
బిజెపికి 27 శాసనసభా స్థానాలు, 9 లోక్‌సభ సీట్లు ఇవ్వాలని తెలుగుదేశం నిర్ణయించడంతో ఆ స్థానాల గుర్తింపునకు ఇరు పార్టీల నేతలు చర్చలు జరుపుతారు. పార్టీల బలాబలాలను, అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుని ఆ స్థానాలను ఖరారు చేస్తారు. చర్చల్లో తెలుగుదేశం తరఫున టి. దేవేందర్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, కళా వెంకట్రావు, బిజెపి తరఫున ఎన్. ఇంద్రసేనా రెడ్డి, శేషగిరిరావు, హరిబాబు పాల్గొంటారు. గతంలో గెల్చిన స్థానాలను, ఓడిన స్థానాలను పరిగణనలోకి తీసుకుంటారు. సీట్ల కేటాయింపు పట్ల బిజెపిలో కొంత అసంతృప్తి చోటు చేసుకుంది. ఎక్కువ స్థానాలను పొందడానికి తెలుగుదేశం పార్టీని ఒప్పించడంలో బిజెపి నాయకులు విఫలమయ్యారని అంటున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!