వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
నిజామాబాద్ లోక్సభ సీటుపై కాంగ్రెస్, టిఆర్ఎస్ల మధ్య పట్టువిడుపులు లేకపోవడంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఆ సీటు తమకే కావాలంటూ టిఆర్ఎస్, ససేమిరా అంటూ కాంగ్రెస్ పట్టుబట్టి కూర్చున్నాయి. తమ పార్టీ నుంచి ఒక ఎన్నారైకికాంగ్రెస్ నాయకులు ఈ సీటును అనధికారికంగా ఖరారు చేశారు.
దీంతో వెనక్కి తగ్గేందుకు కాంగ్రెస్ నాయకులు ఇష్టపడడం లేదు. దీనికి బదులు టిఆర్ఎస్కు కాంగ్రెస్ హైదరాబాద్ సీటు ఇవ్వజూపుతోంది. ఇందుకు టిఆర్ఎస్ ఏ మాత్రం సుముఖంగా లేదు. మరో ఆరు నుంచి 8 శాసనసభా స్థానాల విషయంలో కూడా వివాదం నెలకొంది.
సీట్ల సర్దుబాటు సామరస్యపూర్వకంగా పూర్తవుతుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రికి చర్చలు ఒక కొలిక్కి రావచ్చునని భావిస్తున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!