వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్‌దర్బార్లు పెట్టవద్దు: వైయస్
హైదరాబాద్: తెలంగాణ ప్రయోజనాలను తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడుకె. చంద్రశేఖర్‌రావు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తాకట్టుపెట్టారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనారెడ్డివ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ రాష్ట్ర ప్రజలను మభ్య పెడుతున్నాయని ఆయన శుక్రవారంవిలేకరుల సమావేశంలో అన్నారు.
కొన్ని చోట్ల తెలుగుదేశం నాయకులు ప్రవర్తిస్తున్న తీరు పట్ల ఆయనవిచారం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలను ప్రభావం చూపే ప్రకటనలు చేయడం మంచిది కాదని ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి అన్నారు. అద్వానీ రథయాత్ర ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రంలో ఉంటుందని ఆయన చెప్పారు. ఈ లోగానే తెలుగుదేశంతోసీట్ల సర్దుబాటు పూర్తవుతుందని ఆయన చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!