వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌:సినీనటి సౌందర్య మృతికితెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు బాధ్యుడనితెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావు చేసినఆరోపణపై మాజీ కేంద్ర మంత్రి,కరీంనగర్‌ బిజెపి లోక్‌సభ అభ్యర్థిచెన్నమనేని విద్యాసాగర్‌ రావుతీవ్రంగా ప్రతిస్పందించారు.చంద్రశేఖర్‌రావుపై ఆయనతీవ్రంగా ధ్వజమెత్తారు. సౌందర్యమృతికి చంద్రబాబు బాధ్యుడనిచంద్రశేఖర్‌రావు అనడందగాకోరు తనమని ఆయన ఆదివారంవిలేకరులతో అన్నారు. విద్యాసాగర్‌రావుపై చంద్రశేఖర్‌ రావుకరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో పోటీపడుతున్నారు.విమానంకండీషన్‌ బాగా లేదని చెప్పినా ఢిల్లీలోతన ప్రాబల్యం వాడి కరీంనగర్‌కుసౌందర్యను రప్పించడానికిచంద్రబాబు ప్రయత్నించారని, ఆకారణంగానే సౌందర్య మృతిచెందిందని చంద్రశేఖర్‌ రావుఅనడం శవరాజకీయాలుచేయడమేనని ఆయన అన్నారు.రాజకీయంగా బద్ధశత్రువు కూడా ఈవిధంగా నీచాతినీచమైన విమర్శలుచేయరని ఆయన అన్నారు. సౌందర్యప్రచారం చేసే విషయం చంద్రబాబుకుతెలియనే తెలియదని ఆయన స్పష్టంచేశారు.సౌందర్యమృతి కరీంనగర్‌ పర్యటనకుముడిపడి వున్నందున తానుబాధలో ఉన్నానని, అయితే సంబంధంలేని చంద్రబాబును కెసి ఆర్‌వివాదంలోకి లాగడం సరైంది కాదనిఆయన అన్నారు. సౌందర్య మృతిహృదయ విదారకమైన సంఘటనఅని, ఇటువంటి సంఘటనపై సంతాపంప్రకటించి ఊరుకోవడం సరైందని,దాన్ని రాజకీయాలకు జోడించడంక్షమించరానిదని ఆయన అన్నారు.చంద్రశేఖర్‌రావు తెలంగాణకు ముందస్తుద్రోహం తలపెట్టారని, ముప్పై యేళ్లక్రితం ఎన్నికలు జరిగిన తర్వాత మర్రిచెన్నారెడ్డి నాయకత్వంలోతెలంగాణకు ద్రోహం జరిగిందని, ఇప్పుడుఎన్నికలు జరగకముందేచంద్రశేఖర్‌ రావు తెలంగాణకుద్రోహం చేశారని విద్యాసాగర్‌ రావువిమర్శించారు. కరీంనగర్‌ వచ్చినకాంగ్రెస్‌నేతలు సోనియా గానీ, గులాంనబీ ఆజాద్‌ గానీ తెలంగాణ ఏర్పాటునుప్రస్తావించనే లేదని, అటువంటప్పుడు ఎలాతెలంగాణ ఏర్పడుతుందని ఆయనఅన్నారు. పదవుల కోసం చంద్రశేఖర్‌రావు అర్రులు చాస్తున్నారని ఆయనవిమర్శించారు. పదవుల కోసం,అధికారం కోసం చంద్రశేఖర్‌ రావురెండు చోట్ల పోటీ చేస్తున్నారని ఆయనవ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X