• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేశంటికెట్‌పై నాగేందర్‌: డియస్‌పైనిప్పులు

By Staff
|

హౖదరాబాద:తెలంగాణ ఊసు లేకుండా బిజెపి మేనిఫెస్టోను సోమవారం విడుదలచేశారు.ఇప్పటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగాఏర్పడవలసిన అవసరంలేదని బిజెపి రాష్ట్ర శాఖ తన ఎన్నికలప్రణాళికలో స్పష్టంచేసింది. నక్సల్స్‌ హింసతో భయభ్రాంతులైబిక్కుబిక్కుమంటున్న తెలంగాణ గ్రామాలు నేడు శాంతి కోసంగంపెడాశతో ఎదురు చూస్తున్నాయని పేర్కొంది.అందుకే తెలంగాణరాష్ట్రం ఏర్పాటు ఈ ఎన్నికల్లో ప్రధానాంశం కాదని బిజెపి భావిస్తోందనితెలిపింది. సోమవారం ఇక్కడి బిజెపి కార్యాలయంలో బిజెపి ఎన్నికలమేనిఫెస్టోను విడుదలచేసిన అనంతరం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌. ఇంద్రసేనారెడ్డి అందులోని ప్రధానమైన అంశాలను వివరించారు.

రాష్ట్రాభివృద్ధికిగోదావరి జలాల సద్వినియోగం ఒక్కటే మార్గమని ఆయన స్పష్టంచేశారు.అందుకే కేంద్రంలోని వాజపేయి ప్రభుత్వం నదుల అనుసంధానంకార్యక్రమంలో ఇచ్చంపల్లి, పోలవరం ప్రాజెక్టులను చేపట్టేందుకుచర్యలు తీసుకొంటున్నదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి-బిజెపికూటమిని గెలిపిస్తే వ్యవసాయదారులకు 12 గంటల పాటు నిరాటంకంగావిద్యుత్‌ సరఫరా అయ్యేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడితీసుకువస్తామని తమ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చినట్లు తెలిపారు.రాష్ట్రంలో ఐ ఎస్‌ ఐ కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని, కాంగ్రెస్‌ పార్టీఅధికారంలోకి వస్తే జిహాదీ శక్తులకు పట్టపగ్గాలు ఉండవనిహెచ్చరించారు. ఈ జిహాదీశక్తులకు మజ్లిస్‌ పార్టీ మద్దతు ఇస్తున్నదని ఈసందర్భంగా ఇంద్రసేనా రెడ్డి ఆరోపించారు. సోనియాను దేశప్రధానిగాచేస్తే వంద కోట్లమంది భారతీయులను అవమాన పరిచినట్లేనని ఆయనఅభిప్రాయపడ్డారు. ఒకవేళ ఇదే జరిగితే భారత స్వాతంత్య్రానికి అర్థమేమిఉంటుందని ఆయన ప్రశ్నించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more