• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలుగుదేశమేగెలుస్తుంది: ఎర్రన్నాయుడు

By Staff
|
రావల్పిండి:పాకిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌లటెస్టు సిరీస్‌ను భారత్‌ కైవసంచేసుకుని చరిత్ర సృష్టించింది. మూడోటెస్టును ఇన్నింగ్స్‌ నూటా ముప్పై ఒకపరుగుల తేడాతో గెల్చుకోవడం ద్వారాభారత్‌ సిరీస్‌ను రెండు - ఒకటిస్కోరుతో గెల్చుకుంది. మొదటి టెస్టుమ్యాచ్‌ను భారత్‌ గెల్చుకోగా, రెండోటెస్టులో పాక్‌ విజయం సాధించింది. దీంతోరావల్పిండిలో జరిగిన మూడో టెస్టుకీలకంగా మారింది. ఈ మ్యాచ్‌ను భారత్‌భారీ తేడాతో గెల్చుకుంది.

ఈమ్యాచ్‌లో రెండు వందల డెబ్బైపరుగులు చేసిన భారతబ్యాట్స్‌మన్‌ రాహుల్‌ ద్రావిడ్‌ మ్యాన్‌ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. వన్డేసిరీస్‌ను కూడా భారత్‌ గెల్చుకున్నవిషయం తెలిసిందే. భారత్‌ క్రికెట్‌జట్టు సిరీస్‌నే కాదు, పాకిస్థాన్‌ ప్రజలమనుస్సులను కూడా గెల్చుకుందనిపాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌, క్రికెట్‌వ్యాఖ్యాత రమీజ్‌ రాజా ప్రశంసించాడు.పరుగుల వరద కురిపించినభారత జట్టు ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌వీరేంద్ర సెహ్వాగ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గాఎంపికయ్యాడు.

కీలకమైనమూడో టెస్టులో పాకిస్థాన్‌ రెండువందల నలబై అయిదు పరుగులుచేయగా, రెండో ఇన్నింగ్స్‌లో రెండువందల ఇరవై నాలుగు పరుగులకేచేతులెత్తేసింది. ఈ విజయంలో మరోసారిభారత స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే కీలకపాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో అనిల్‌కుంబ్లే నాలుగు వికెట్లను కూల్చగా, బాలాజీమూడు వికెట్లు తీసుకున్నాడు. మొదటిఇన్నింగ్స్‌లో బాలాజీ నాలుగు వికెట్లుతీసుకున్నాడు. బాలాజీ, ఇర్ఫాన్‌ పఠాన్‌లు ఈసిరీస్‌ మొత్తంలో అత్యుత్తమబౌలింగ్‌ను ప్రదర్శించారు. బాలాజీ,పఠాన్‌ల ఫిట్న్‌నెస్‌ను భారతకెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీకొనియాడాడు.

రెండోఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ఎవరు కూడా భారత బౌలింగ్‌ ముందునిలదొక్కుకోలేకపోయారు. భారతఫీల్డర్లు శుక్రవారంనాడు అయిదారుక్యాచ్‌లు వదిలేశారు. అయినా విజయంత్వరగానే చేతికి చిక్కింది. పాకిస్థాన్‌బ్యాట్స్‌మెన్‌లో కమాల్‌ ఒక్కడే అరవైపరుగులతో కాస్తా మెరుగైన ఆటప్రదర్శించాడు. యోహానా భారతబౌలర్లను కొంత ప్రతిఘటించేప్రయత్నం చేశాడు. అయితే ఫలితంలేకపోయింది. యోహానా నలబై ఎనిమిదిపరుగులు చేసి అవుటయ్యాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X