• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు

By Staff
|

హైదరాబాద్‌:నక్సలైట్లకు కాంగ్రెస్‌ పార్టీసహకరిస్తోందని తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడువిమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి(టి ఆర్‌యస్‌) నక్సల్స్‌ ఎజెండానేఅమలు చేస్తోందని ఆయన అన్నారు. తమపార్టీ సీనియర్‌ నాయకుడు కె.ఎర్రంనాయుడుపై నక్సల్స్‌ దాడిచేయడంపై ఆయన మీడియా వద్దతీవ్రంగా ప్రతిస్పందించారు.కాంగ్రెస్‌పార్టీ నక్సలైట్లతో కుమ్మక్కయిందని,పోలీసు బందోబస్తు లేకుండా ప్రచారానికిరావాలని నక్సలైట్స్‌ కాంగ్రెస్‌వారికిచెబుతున్నారని ఆయన అన్నారు.తెలుగుదేశం కార్యకర్తలను,నాయకులను నక్సలైట్లుచంపుతుంటే కాంగ్రెస్‌ ఒక్క మాట కూడామాట్లాడడం లేదని, నక్సలైట్లుతమ నాయకులపై దాడులు చేస్తుంటేదాన్ని అవకాశంగా తీసుకొని కాంగ్రెస్‌మరింతగా రెచ్చిపోతున్నారనిచంద్రబాబు అన్నారు.ఎర్రంనాయుడుపైనక్సల్స్‌ దాడి చేయడం దారుణం,బాధాకరమని ఆయన అన్నారు. దాడివిషయం తెలిసి తాను తీవ్ర దిగ్భ్రాంతికిలోనయ్యానని ఆయన చెప్పారు.అదృష్టవశాత్తు దాడి నుంచిఎర్రంనాయుడు బయటపడ్డారనిఆయనఅన్నారు. ప్రజాప్రతినిధులపైనక్సల్స్‌ దాడి చేయడం దారుణమనిఆయన వ్యాఖ్యానించారు.ఎన్నికలకునక్సల్స్‌ను ఎజెండాగా చేసుకోవడాన్నిఆయన సమర్థించుకున్నారు.శాంతిభద్రతలనుపరిరక్షించడం, ప్రజలకుశాంతియుత పరిస్థితులనుకల్పించడం తమ బాధ్యత అనిఆయన చెప్పారు. నక్సల్స్‌ జనజీవనస్రవంతిలో కలిసిపోవాలని, హింసనువిడనాడాలని తాము కోరుతున్నామనిఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X