వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తొలి విడత పోలింగ్‌ జరిగే రాష్ట్రంలోని నూటానలబై యేడు అసెంబ్లీ స్థానాల్లో, ఇరవైఒక్క లోక్‌సభ స్థానాల్లో ప్రచార ఘట్టానికితెర పడింది. ఆదివారం సాయంత్రంఐదు గంటలకు ఎక్కడి మైక్‌లు అక్కడేమూగబోయాయి. తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడుమహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తిలోతన చివరి ఎన్నికల ప్రసంగం చేశారు.తొలివిడత అన్ని తెలంగాణ జిల్లాల్లోనూ,ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోనూపోలింగ్‌ జరగనుంది. తొలి విడత పోలింగ్‌జరిగే లోక్‌సభ స్థానాల్లో నూటా ముప్పైరెండు మంది అభ్యర్థులు, అసెంబ్లీస్థానాల్లో ఎనిమిది వందల యాబై ఏడు మందిఅభ్యర్థులు రంగంలో ఉన్నారు.నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోముందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్రసమితితో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్‌తెలుగుదేశం, బిజెపి కూటమినితెలంగాణలో ఎదుర్కుంటోంది.తెలుగుదేశం, బిజెపి నాయకులకు,కార్యకర్తలకు నక్సలైట్ల నుంచితీవ్రమైన ముప్పు ఉన్న ఈ ప్రాంతంలో ఆపార్టీల ప్రచారం అంత సజావుగాసాగలేదు.ఇదిలావుంటే, తెలుగుదేశం, బిజెపి కూటమికితెలంగాణ ప్రాంతంలో ఎదురుగాలివీస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.కాంగ్రెస్‌, టి ఆర్‌యస్‌, వామపక్షాలకూటమి నుంచి చంద్రబాబు గట్టి పోటీనిఎదుర్కుంటున్నారు. ప్రభుత్వవ్యతిరేక పవనాలు, తెలంగాణసెంటిమెంట్‌, నక్సలైట్ల ముప్పుచంద్రబాబుకు తెలంగాణలో సవాల్‌గానిలిచాయి. కాంగ్రెస్‌కు పెట్టని కోటగా ఉన్నఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విశాఖపట్నం,విజయనగరం జిల్లాల్లో కూడాతెలుగుదేశం, బిజెపి కూటమి తమప్రాబల్యాన్ని నిలబెట్టుకోవడానికి తీవ్రంగాప్రయత్నించింది.నాలుగేళ్లవరస కరువు తాకిడి, నీటిపారుదల సౌకర్యాల కొరత, పెరిగిననిరుద్యోగం, కార్మికులకు పనిదొరకకపోవడం, నిత్యావసరసరుకుల ధరల పెరుగుదల,విద్యుచ్ఛక్తి సరఫరాలోఅంతరాయాలు, మంచినీటి సౌకర్యాలకొరత వంటి సమస్యలుతెలుగుదేశం ప్రభుత్వానికివ్యతిరేకంగా పని చేసేఅవకాశాలున్నాయి. తమ ప్రాంతాన్నిపూర్తిగా నిర్లక్ష్యం చేశారనేఅభిప్రాయం తెలంగాణ ప్రాంతంలోప్రబలంగా ఉంది. దీంతో కె. చంద్రశేఖర్‌రావు ఏర్పాటు చేసిన టి ఆర్‌యస్‌కువిశేషమైన స్పందన లభిస్తోంది. ఈపరిస్థితుల్లో తొలి విడత పోలింగ్‌జరుగుతున్న తెలంగాణ ప్రాంతంలోతెలుగుదేశం, బిజెపి కూటమిఎదురీదక తప్పదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X