• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు

By Staff
|

హైదరాబాద్‌:విశాఖపట్నం జిల్లా కొయ్యలగూడెం మండలంపలకజీడి పోలింగ్‌ కేంద్రం నుంచిఐదుగురు పోలింగ్‌ సిబ్బందిని నక్సలైట్లుకిడ్నాప్‌ చేశారు. నక్సలైట్లుతలపెట్టిన విశాఖపట్నం జిల్లా పాడేరుబంద్‌ మంగళవారం విఫలమైంది.ప్రజలు ఓట్లు వేయడానికే మొగ్గు చూపారు.రాష్ట్రంలో ఎన్నికల బహిష్కరణకునక్సల్స్‌ ఇచ్చిన పిలుపునకు స్పందనకనిపించలేదు.కిడ్నాప్‌నకుగురైన పోలింగ్‌ సిబ్బందిసురక్షితంగా ఉన్నారు. వారినినక్సలైట్లు వదిలేశారు. ఈ ఐదుగురుపోలింగ్‌ సిబ్బంది తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం పోలిసు స్టేషన్‌కుచేరుకున్నారు.ఇదిలావుంటే, సదాశివపేటలోని తొంబై ఒకటవపోలింగ్‌ కేంద్రంలో యంత్రంపై ఏ మీటనొక్కిన బిజెపికి ఓటు పడింది. దీంతో అక్కడపోలింగ్‌ను నిలిపేశారు. రంగారెడ్డి జిల్లాఇబ్రాహింపట్నంలో వేయి మంది ఓట్లుగల్లంతయ్యాయి. మెదక్‌ జిల్లాగజ్వెల్‌లో గుర్తింపుకార్డులున్నప్పటికీ నూటా యాభైమంది పేర్లు ఓటర్ల జాబితాలోకనిపించలేదు. దీంతో వారు గొడవకుదిగారు. ఈ కారణంగా పోలింగ్‌నునిలిపేశారు.రాష్ట్రంలోపోలింగ్‌ సందర్భంగా పలు చోట్ల అధికారతెలుగుదేశం పార్టీ, ప్రతిపక్షాలకార్యకర్తల మధ్య ఘర్షణలుజరిగాయి. నల్లగొండ జిల్లా ఆత్మకూర్‌(యస్‌) మండలంలోని మక్తాకొత్తగూడెంలో కాంగ్రెస్‌,తెలుగుదేశం పార్టీల కార్యకర్తలమధ్య ఘర్షణ జరిగింది. అలాగే కోదాడశాసనసభా నియోజకవర్గంలోనిసిరిపురంలో కూడా ఇరు పార్టీలకార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా షాబాద్‌మండలం మన్‌మర్రి గ్రామంలోరెండు పార్టీల కార్యకర్తలుపరస్పరం రాళ్లురువ్వుకున్నారు.కరీంనగర్‌జిల్లా కొండమానిపల్లెలో పోలింగ్‌క్లర్క్‌పై దాడి జరిగింది. రంగారెడ్డి జిల్లాచేవెళ్ల మండంలోని అస్తేపూర్‌ప్రజలకు తమ గ్రామానికి మంచినీటిసౌకర్యం కల్పించాలని కోరుతూపోలింగ్‌ను బహిష్కరించారు.కరీంనగర్‌ జిల్లా బీమదేవరపల్లిగ్రామంలో తెలుగుదేశం, తెలంగాణరాష్ట్ర సమితి కార్యకర్తల మధ్యఘర్షణ జరిగింది. ఖమ్మం జిల్లా లచ్చగూడెంగ్రామంలో తెలుగుదేశం, కాంగ్రెస్‌కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈఘర్షణలో పలువురు గాయపడ్డారు.విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలందేవరకొండ గ్రామంలో స్వతంత్రఅభ్యర్థి కార్యకర్తలకు,తెలుగుదేశం కార్యకర్తలకుమధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటలోపలువురు గాయపడ్డారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more