• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు

By Staff
|

హైదరాబాద్‌: కోస్తా ఆంధ్ర, రాయలసీమలో కూడా తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్ధితిని ఎదుర్కోంటున్నట్టు వివిధ జిల్లాల నుంచి వస్తున్న వార్తలు తెలియజేస్తున్నాయి. పార్టీల భవిష్యత్తులను తేల్చే ఉభయగోదావరి జిల్లాల్లో తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల బలాబలాలు ఇప్పటికిప్పుడు సమానంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈరెండు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి ముప్పై అయిదు, కాంగ్రెస్‌కు రెండు స్ధానాలు వచ్చాయి. ఈ రెండు జిల్లాల్లోనే ఇరవై స్ధానాలు కోల్పోవలసి రావడం టిడిపికి పెద్ద దెబ్బ. ప్రభుత్వవ్యతిరేక పవనాలు రాష్ట్రమంతటా బాగా వీస్తున్నాయి. ఇవి వచ్చే మూడు నాలుగు రోజుల్లో బలపడితే సర్వేలలో చెప్పిన దానికంటే తెలుగుదేశం పార్టీకి తక్కువ సీట్లు వచ్చే అవకాశముంది. వంద స్ధానాలలోపే అధికారపార్టీకి వచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. మహిళల ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని తెలుగుదేశం పార్టీ నమ్మకం పెట్టుకున్నప్పటికీ ఆ సెగ్మెంటులో కూడా కొరత కన్పిస్తున్నది. ఎన్టీఆర్‌ కుమార్తె, దగ్గుబాటి భార్య , బాపట్ల కాంగ్రెస్‌అభ్యర్ధిని పురంధరేశ్వరి గురువారం ప్రకాశం జిల్లాలో నిర్వహించిన రోడ్‌షోలు విజయవంతమయ్యాయి. ఈ జిల్లాలో టిడిపి కంటే కాంగ్రెస్‌ కు అధికంగా అసెంబ్లీ స్ధానాలు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇదే ట్రెండ్‌ కొనసాగితే బాపట్ల టిడిపి అభ్యర్ధి డి.రామానాయుడు, విజయవాడ పార్లమెంటు టిడిపి అభ్యర్ధి అశ్వనీదత్‌ ఓడిపోయే అవకాశాలున్నాయి. కృష్ణాజిల్లా రైతాంగంలో టిడిపి వ్యతిరేకత తీవ్రంగా ఉంది. కోస్తా ఆంధ్ర, రాయలసీమలో తెలంగాణ వ్యతిరేకత పెద్దగా కన్పించకపోవడం మరో విశేషం. రెండో విడత పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో ఈ అస్త్రం పనిచేస్తుందని ఆశలు పెట్టుకున్న టిడిపికి నిరాశే ఎదురవుతోంది. కాంగ్రెస్‌ ఉచిత విద్యుత్‌ నినాదం కోస్తా, రాయలసీమలలో పెద్ద ప్రభావం చూపకపోయినా ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నది. కోస్తాలో కొందరు మంత్రులు కూడా ఓడిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రచారానికి వెళ్ళకపోయినా తనకు ఇరవై వేల మెజారిటీ వస్తుందని ప్రతిసారి చెప్పే గుంటూరు జిల్లా మంత్రి కోడెల శివప్రసాదరావు నర్సరావుపేట నియోజకవర్గంలో కాళ్ళకు బలపాలు కట్టుకుని తిరుగుతున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more