వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ములాయంపైమెత్తబడిన లాలూ యాదవ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్‌ యాదవ్‌పై రాష్ట్రీయ జనతాదళ్‌ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కాస్తా మెత్తబడ్డారు. ప్రధాని పదవికిములాయంను అంగీకరించే ప్రసక్తేలేదని బుధవారం ప్రకటించినలాలూప్రసాద్‌ గురువారం కాస్తా దిగివచ్చారు.

లౌకిక కూటమితో ఉంటే ప్రధాని పదవికిములాయంను అంగీకరిస్తామని ఆయనగురువారం ప్రకటించారు. అయితేఅనవసరమైన రాద్ధాంతాన్నిసహించబోమని ఆయన అన్నారు.ములాయం ఆదేశాలను, షరతులనుతాము అంగీకరించబోమని, లౌకిక కూటమినిబలపరిస్తే సమస్య లేదని ఆయనఅన్నారు. ఆజ్‌తక్‌కు ఇచ్చినఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు చెప్పారు.ములాయం సరిగా వ్యవహరిస్తేసమస్యలు లేవని ఆయన అన్నారు.ములాయంబిజెపితో స్నేహం చేస్తున్నారని,ములాయం తమకు సన్నిహితుడనివాజ్‌పేయినే స్వయంగా చెప్పారనిఆయన అన్నారు. లౌకిక కూటమికి ఎవరునాయకత్వం వహిస్తారని ప్రశ్నిస్తేసోనియాగాంధీయేనని ఆయనజవాబిచ్చారు. సోనియా గాంధీ నిరాకరిస్తే ఆతర్వాత ఆలోచిస్తామని ఆయనచెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X