ముంబయి:వాజ్పేయే తమ అధినాయకుడని గురువారం బిజెపి స్పష్టంచేసింది. ఇంతవరకు చేసిందిచాలు, ఇక చాలు నాకొద్దీ నాయకత్వం అని వాజపేయి తన రాజకీయవైరాగ్యం ప్రకటించడం భారతీయ జనతా పార్టీలో సంచలనంకలిగించింది . వాజపేయిని మరలా సముదాయించేందుకు పార్టీనడుంకట్టింది. వాజపేయి మా అధినాయకుడు అని కీర్తించిఆయనను చలబరచడానికి పార్టీ రంగంలోకి దిగింది.
వాజపేయికితనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉంది, దానికి వేరే ఉద్దేశం లేదు,ఇప్పటికీ వాజపేయే మా అధినాయకుడు అని బిజెపి ఉపాధ్యక్షుడుముక్తర్ అబ్బాస్ నక్వీ గురువారం నాడు పిటిఐతో మాట్లాడుతూఅన్నారు. పార్టీలో అన్ని నిర్ణయాలు సమిష్టిగా తీసుకుంటాము, సమిష్టినాయకత్వానికి వాజపేయి నాయకత్వం వహిస్తున్నారని ఆయనఅన్నారు. బుధవారం నాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీకార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇంతవరకూ తానే చేసిందిచాలని, పార్టీకి తాను ఇంకోసారి నాయకత్వం వహించబోనని అన్నారు.వాజపేయి వ్యాఖ్యల నేపధ్యంలో గురవారం నాడు పార్టీ నుంచి ఇలాస్పందన రావడం గమనార్హం.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి