వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రైవేటీకరణనుగుడ్డిగా అనుసరించం: మన్మోహన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:ప్రైవెటీకరణను గుడ్డిగాఅనుసరించబోమని, ఆర్థిక సంస్కరణలఫలితాలు అత్యంత నిరుపేదలకుఅందేలా జాగ్రత్తలు తీసుకుంటామనికాబోయే ప్రధాని మన్మోహన్‌ సింగ్‌చెప్పారు. తాము ప్రైవేటీకరణకువ్యతిరేకం కాదని, అయితే ప్రతిదీప్రైవేటీకరణ ద్వారానేపరిష్కారమవుతుందనిచెప్పబోమని ఆయన అన్నారు.

గుడ్డిగాఅనుసరించే ప్రైవేటీకరణసిద్ధాంతాన్ని తాము విశ్వసించబోమనిస్పష్టంగా చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. ఆయన గురువారం ఉదయంవిలేకరులతో మాట్లాడారు. భారత్‌ -పాక్‌ సంబంధాల నుంచి అయోధ్యవరకు, గుజరాత్‌ మతఘర్షణలనుంచి పెట్టుబడుల ఉపసంహరణవరకు, పేదరికంపై పోరాటం నుంచినదుల అనుసంధానం వరకు అన్నివిషయాలపై ఆయన మనసు విప్పిమాట్లాడారు.సమర్థ,లౌకిక ప్రభుత్వాన్ని అందించేందుకు,పేదరిక, నిరక్షరాస్యతనిర్మూలనకు ప్రజలు తమకుఅనుకూలంగా తీర్పు ఇచ్చారని ఆయనచెప్పారు. ఆర్థిక సంస్కరణల అమలులోమానవీయ కోణం ఉండాలనేది తమఉద్దేశమని ఆయన చెప్పారు.పెట్టుబడుల ఉపసంహరణను ఒకసిద్ధాంతంగా అమలు చేయబోమని,భారత్‌లో బలమైన ప్రభుత్వరంగం అవసరం ఉందని, ఒన్‌జిసి,గెయిల్‌, జాతీయ బ్యాంకుల వంటిప్రభుత్వ రంగ సంస్థలనుప్రైవేటీకరించబోమని ఆయనస్పష్టం చేశారు. ప్రైవేట్‌ కంపెనీలతోపోటీ పడటానికి సిద్ధపడితే వాటినిప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు.ప్రైవేట్‌ కంపెనీలతో పోటీ పడలేనికంపెనీల విషయంలో ఆలోచన చేస్తామని,అయితే ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలోఉంచుకునే ప్రైవేటీకరణకుచర్యలు తీసుకుంటామని ఆయనఅన్నారు.రైతులసమస్యలను పరష్కరించే విధంగాసంస్కరణలు అమలు జరగాలని ఆయనఅన్నారు. రైతుల, గ్రామీణ ప్రజలసమస్యలను పరిష్కరించే దిశగాసాగుతామని ఆయన చెప్పారు. మతవిభేదాలకు అంతం పలకాల్సినఅవసరం ఉందని ఆయన చెప్పారు.గత ప్రభుత్వం చేపట్టిన మంచిపనులను కొనసాగిస్తామని ఆయనచెప్పారు.ప్రజలుసోనియా గాంధీ నాయకత్వం కోసం తీర్పుఇచ్చారని, దాన్ని ఆమె వినయపూర్వకంగాతిరస్కరించారని ఆయన ఒక ప్రశ్నకుసమాధానంగా చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X