వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను బిచ్చగాడిని కాను:లాలూ ప్రసాద్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తనకు అధికారం మీద మమకారంలేదని, తన మీద జరుగుతున్నదంతా దుష్ప్రచారమేననిఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చెప్పారు. కాంగ్రెస్‌సంకీర్ణంలో ఆర్జెడి రెండో పెద్ద పార్టీ అని, తాని బిచ్చగాడిని కాదనిఆయన అన్నారు. కేంద్ర మంత్రివర్గంలో క హోం శాఖను కోరిభంగపాటుకు గురై పాట్నాకు వెళ్ళిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌శుక్రవారం న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. కీలకమైన హోం, ఆర్థికశాఖలను ప్రధాని అభ్యర్థి మన్మోహన్‌ సింగ్‌ తన వద్దేఅట్టిపెట్టుకుంటారని వార్తలొచ్చాయి. బీహార్‌రైతాంగానికి,యువత, పేద ప్రజానీకానికి సరైన న్యాయంజరిపించాలని కోరుతూ కేంద్రంపై ఒత్తిడి తెస్తానని అంతే తప్ప హోంమంత్రిపదవిని డిమాండ్‌ చేయలేదని లాలూ ఈ సందర్భంగా అన్నారు.

ప్రభుత్వం ఏర్పాటు విషయంలో మిత్రపక్షాలను కాంగ్రెస్‌సంప్రదించటం లేదని లాలూ ఫిర్యాదు చేశారు. కనీస ఉమ్మడికార్యక్రమం రూపకల్పనలో మిత్రపక్షాలను విశ్వాసంలోకితీసుకోవాలని కాంగ్రెస్‌ను కోరారు. ఎన్‌.సి.పి నేత శరద్‌పవార్‌, లోక్‌జనశక్తి నాయకుడు రాం విలాస్‌ పాశ్వాన్‌, డి. ఎం.కె నేత ఎం. కరుణానిధితో కాంగ్రెస్‌ చర్చించి తుది నిర్ణయంతీసుకోవాలని సూచించారు.పదవి కోసం తాను పాకులాడటం లేదని బీహార్‌రూపురేఖలను మార్చటం తన ధ్యేయమని చెప్పారు. తానుకొత్తగా ఇప్పుడేమీ డిమాండ్‌ చేయటం లేదని సహజ వనరులసంపదతో తులతూగే ఝార్ఖండ్‌ రాష్ట్రం బీహార్‌ నుంచివిడివడటంతో ఆ నష్టాన్ని భర్తీ చేయటానికి వాజపేయి ప్రభుత్వంబీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిందని అన్నారు. ప్రాంతీయ రాష్ట్రాలమధ్య అసమానతలు సృష్టించే విధానాలను ఎన్డీఎ ప్రభుత్వంప్రోత్సహించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమానతలకారణంగా బీహార్‌ బాగా నష్టపోయిందని పేర్కొన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X