వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార్‌ప్రతిపాదనలు వస్తే చర్చలు: డిజిపి

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌:పీపుల్స్‌వార్‌ నక్సలైట్ల నుంచిప్రతిపాదనలు వస్తే వాటిని పరిశీలించిచర్చలకు శ్రీకారం చుడుతుందనిరాష్ట్ర పోలీసు డైరెక్టర్‌ జనరల్‌(డిజిపి) ఎస్‌. ఆర్‌. సుకుమార అన్నారు.పీపుల్స్‌వార్‌ నుంచి ప్రభుత్వానికిఇప్పటి వరకు ఏ విధమైనప్రతిపాదనలు రాలేదని ఆయనబుధవారంవిలేకరులసమావేశంలోఅన్నారు.

ఆయుధాలులేకుండానే ప్రభుత్వ ప్రతినిధులు,నక్సలైట్లు చర్చల్లో పాల్గొంటారనిఆయన చెప్పారు. చర్చలు జరపడానికిఆయుధాలెందుకని ఆయన అడిగారు.చర్చలకు విఘాతం కలిగించే విధంగాపోలీసులు వ్యవహరించరని ఆయనస్పష్టం చేశారు. ఇటీవల ముప్పైరెండు మంది ప్రతిఘటన నక్సలైట్లలొంగుబాటుకు చర్చలకు సంబంధంలేదని ఆయన అన్నారు. ఈ లొంగుబాటుచర్చలకు విఘాతం కలిగించదనిఆయన అన్నారు. చర్చలకు పోలీసులువ్యతిరేకం కాదని ఆయన స్పష్టంచేశారు. చర్చలకు, ఆయుధాలకుసంబంధం లేదని ఆయన అన్నారు.పీపుల్స్‌వార్‌హిట్‌లిస్టులో ఉన్నవారికి భద్రతకొనసాగుతుందని ఆయన చెప్పారు.చర్చలు ఫలప్రదమైతే భద్రతాచర్యలను పునఃసమీక్షిస్తామనిఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X