• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చర్చలకువార్‌ కాల్పుల విరమణ షరతు

By Staff
|

హైదరాబాద్‌:ప్రభుత్వంతో చర్చలకుపీపుల్స్‌వార్‌ అంగీకరించింది. అయితేఅందుకు కొన్ని షరతులు విధించింది. ఈమేరకు పీపుల్స్‌వార్‌ రాష్ట్ర కమిటీకార్యదర్శి రామకృష్ణ, కేంద్రకమిటీ నాయకుడు ప్రకాష్‌ పేర ఒకప్రకటన విడుదలైంది.

మూడునెలల నుంచి ఆరు నెలల పాటు కాల్పులవిరమణ ప్రకటించాలని, కాల్పులవిరమణ పర్యవేక్షణకు ఒకకమిటీని వేయాలని, తమమధ్యవర్తులతో చర్చించి చర్చలకువిధివిధానాలను నిర్ణయించాలని,చర్చలకు వచ్చే ప్రతినిధుల రక్షణబాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలనిపీపుల్స్‌వార్‌ డిమాండ్‌ చేసింది. కాల్పులవిరమణపై ప్రభుత్వం బహిరంగప్రకటన చేయాలని డిమాండ్‌ చేసింది.రాజీకమిటీ ఏర్పాటు పేరుతో,మేధావులతో చర్చల పేరుతోప్రభుత్వం చర్చల విషయంలోకాలయాపన చేస్తోందని పీపుల్స్‌వార్‌విమర్శించింది.ఇదిలావుంటే, రాష్ట్రంలో తాము కాల్పులుజరపడం లేదని, అందువల్లప్రత్యేకంగా కాల్పుల విరమణపైప్రకటన అవసరం లేదని హోం మంత్రికుందూరు జానా రెడ్డి అన్నారు. ఆయనమంగళవారం శాంతి సాధన కమిటీప్రతినిధులతో చర్చలు జరిపారు. చర్చలప్రారంభానికి ముందుపీపుల్స్‌వార్‌పై నిషేధం ఎత్తివేస్తేమంచిదని శాంతి సాధన కమిటీ ప్రతినిధిబొజ్జా తారకం అభిప్రాయపడ్డారు. నిషేధసంస్థ కాబట్టి పీపుల్స్‌వార్‌కుప్రభుత్వ నిర్ణయాలు వెంటనే తెలిసేఅవకాశాలు తక్కువగా వుంటాయనిఆయన అన్నారు. చర్చలు పది, పదిహేనురోజుల్లో ప్రారంభం కావచ్చునని ఆయనచెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more