• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణకోసమే క్యాబినెట్‌లో చేరిక: కెసిఆర్‌

By Staff
|

న్యూఢిల్లీ:తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే తామురాష్ట్ర మంత్రివర్గంలోచేరుతున్నామని తెలంగాణ రాష్ట్రసమితి (టి ఆర్‌యస్‌) అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు. రాష్ట్రవిభజన సమయంలో ఆస్తులు, నిధులకుసంబంధించిన సరైన అవగాహనకోసం మంత్రివర్గంలోచేరుతున్నట్లు ఆయన శుక్రవారంవిలేకరుల సమావేశంలోచెప్పారు.

రాష్ట్రంలోకాంగ్రెస్‌ ప్రజారంజక పాలననుఅందిస్తోందని ఆయన కితాబు ఇచ్చారు.ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుచేయడానికి కృషి చేస్తోందని ఆయనఅన్నారు. ప్రభుత్వంపై భారంపడుతుందని తెలిసినా రైతులకుఉచిత విద్యుత్‌ సరఫరాను అమలుచేయడానికి ముందుకు వచ్చినవిషయాన్ని ఆయన ఈ సందర్భంగాగుర్తు చేశారు.తెలంగాణనీటి పారుదల ప్రాజెక్టులకు ఎక్కువనిధులు కేటాయించాలని ఆయనప్రభుత్వాన్ని కోరారు. విషయమైఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికిసూచనలు చేశామని, ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డినికలిసి మళ్లీ చెబుతామని ఆయన అన్నారు.తెచ్చిన అప్పులను సవ్యంగా ఖర్చు చేస్తేవెసులుబాటు ఉంటుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X