హైదరాబాద్: మాజీ మంత్రి,తెలుగుదేశం నాయకురాలు పుష్పలీల గురువారం తెలంగాణరాష్ట్ర సమితిలో చేరారు. ఆదిలాబాద్ జెడ్పీ మాజీ చైర్మన్సుమతిరెడ్డి మూడు వందల మంది కార్యకర్తలతో టిఆర్ఎస్లోచేరారు. పదవుల కోసం తాను టిఆర్ఎస్లో చేరలేదనితెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్న ఏకైక ధ్యేయంతో చేరాననిపుష్పలీల తెలిపారు.
రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రసంగంలో తెలంగాణప్రస్తావన ఉండడంతో తమకు ఉత్సాహం వచ్చిందని ఆమె చెప్పారు.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన పుష్పలీల చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో సాంఘికసంక్షేమ శాఖ మంత్రిగాపనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు తెలుగుదేశం టికెట్లభించలేదు. తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకులుమరికొందరు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్టు వార్తలువస్తున్నాయి.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి