పోలవరంమొదటి దశ పనులకు నిధులుమంజూరు

Subscribe to Oneindia Telugu
హైదరాబాద్‌:గోదావరి నదిపై తలపెట్టినపోలవరం నీటి పారుదల ప్రాజెక్టుమొదటి దశ పనుల కోసం రాష్ట్రప్రభుత్వం 1320కోట్ల రూపాయలు మంజూరు చేసింది.మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీఅయ్యాయి.
మొదటిదశ కింద ప్రాజెక్టు కుడి ప్రధానకాలువ నిర్మాణం, రెండు వందలయాబై గ్రామాల్లోని కోటీ నలబై లక్షలమందికి మంచినీరు, కృష్ణా నదిప్రకాశం బ్యారేజీ కింద వున్నసాగుభూమికి ఎనబై శతకోటిఘటపుటడుగుల నీరు అందించడంవంటి పనులు చేపడతారు. నిధులవిడుదలలో ఏ మాత్రం వెనుకడుగువేయబోమని, పనులు జరిగే క్రమాన్ని బట్టిఅవసరమైన నిధులను ఈ ఆర్థికసంవత్సరమే విడుదల చేస్తామనిభారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాలలక్ష్మయ్య చెప్పారు. గోదావరి జలాలవినియోగానికి పెండింగ్‌లో ఉన్నప్రాజెక్టులను పూర్తి చేయాలనేదిప్రభుత్వ లక్ష్యమని, ఈ పెండింగ్‌ప్రాజెక్టుల్లో పోలవరం ఒకటని ఆయనచెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Please Wait while comments are loading...