వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడ్డిగుర్రం వరవరరావా మాట్లాడేది?:సత్యమూర్తి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:విప్లవ రచయితల సంఘం (విరసం)కార్యవర్గ సభ్యుడు, పీపుల్స్‌వార్‌ప్రతినిధి వరవరరావుపై మాజీనక్సలైట్‌ నేత, ప్రముఖ కవి కె.జి.సత్యమూర్తి అలియాస్‌ శివసాగర్‌తీవ్రంగా ధ్వజమెత్తారు. వరంగల్‌జిల్లా మొగిలిచెర్ల సభలో తనపైచేసిన విమర్శలకు ఆయనగురువారం విలేకరులసమావేశంలో తీవ్రంగాప్రతిస్పందించారు.వరవరరావును గుడ్డిగుర్రంగా ఆయనఅభివర్ణించారు.

వరవరరావువిప్లవ కారుడు కాడు, విప్లవరచయితా కాడని ఆయన అన్నారు."తుపాకి ఎత్తితే కదా, తుపాకిదించేది. వరవరరావు ఏనాడూతుపాకి ఎత్తలేదు" అని ఆయనఅన్నారు. తుపాకి ట్రిగ్గర్‌ ఎక్కడుందోతెలియని వరవరరావుకు తనవిప్లవ చరిత్రను విమర్శించే హక్కులేదని ఆయన అన్నారు. తాను ఇరవైయేళ్లు అజ్ఞాతవాసం గడిపానని,పదేళ్లు జైలులో ఉన్నానని ఆయనచెప్పారు. బతికుంటే బలుసాకుతినవచ్చుననే పద్ధతివరవరరావుదని ఆయనవ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తీవ్రనిర్బంధం అమలవుతున్నప్పుడు అఖిలభారత ప్రతిఘటనా వేదిక పేరు మీదఇతర ప్రాంతాలకు వెళ్లడంవరవరరావు సంప్రదాయమనిఆయన అన్నారు. గద్దర్‌పై దాడి జరిగినసమయంలో ఇక్కడ పెద్దయెత్తునఆందోళన జరిగితే వరవరరావుఇక్కడ లేకుండా పోయారని ఆయనఅన్నారు. వరవరరావువిప్లకారుల్లో మహా రచయిత అని,మహారచయితల్లో విప్లవకారుడనిఆయన వ్యాఖ్యానించారు.భర్తప్రాణాల కోసం వరవరరావు భార్యతెలుగుదేశం ప్రభుత్వ హయాంలోహోం మంత్రిని కలుసుకున్నారని, అదివరవరరావు పోరాటరూపమని,ఇంకెవరైనా అలా చేసి వుంటేఏమనేవారని ఆయన అన్నారు.తనను కోవర్టుగా పోల్చడంవరవరరావు అహంకారమనిఆయన దుయ్యబట్టారు.పీపుల్స్‌వార్‌లోనే కోవర్టులున్నారనిఆయన అన్నారు. జనం కనిపిస్తేవరవరరావు నరాలు ఆగవనిఆయన అన్నారు. తన వ్యక్తిగతఅభిప్రాయాలను వెల్లడించే అధికారంవరవరరావుకు ఎవరిచ్చారనిఆయన అడిగారు. వరవరరావుగిరీశం పాత్ర పోషిస్తున్నారని ఆయనఅన్నారు. పీపుల్స్‌వార్‌కు సిద్ధాంతప్రాతిపదిక లేదని, పీపుల్స్‌వార్‌అనుసరించేది మార్క్సిస్టు లెనినిస్టుతాత్విక దృక్పథం కాదని, తానుసాయుధ పోరాటాన్నివ్యతిరేకించలేదని, పీపుల్స్‌వార్‌దృక్పథాన్నే విమర్శించానని ఆయనస్పష్టం చేశారు. పీపుల్స్‌వార్‌రాజకీయ పార్టీ కాదని, దళాల పార్టీ అనిఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X