వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజ్ఞాతంవీడిన సొరేన్‌ కొడుకు ఇంట్లోప్రత్యక్షం

By Staff
|
Google Oneindia TeluguNews

రాంచీ:హత్య కేసులో నిందితుడైన మాజీకేంద్ర మంత్రి, జార్ఖండ్‌ ముక్తిమోర్చా నేత శిబు సొరేన్‌ ఎట్టకేలకుఅజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు. హత్యకేసులో అరెస్టు వారెంట్‌ జారీ కావడంతోశిబు సొరేన్‌ పది రోజుల క్రితం అజ్ఞాతంలోకివెళ్లారు. ఆయన శుక్రవారం తనకుమారుడి నివాసంలోదర్శనమిచ్చారు.

తానుఎక్కడికీ పారిపోలేదని, ప్రజల మధ్యనేఉన్నానని ఆయన అన్నారు. జార్ఖండ్‌హైకోర్టు తీర్పు కోసం తానునిరీక్షిస్తున్నానని, అది నిన్నవెలువడిందని ఆయన విలేకరులతోఅన్నారు. రాజకీయ దురుద్దేశంతోతనపై కేసును బిజెపి ప్రభుత్వంతిరగదోడిందని ఆయనవిమర్శించారు. న్యాయవాదులతోమాట్లాడిన తర్వాత ఎప్పుడులొంగిపోవాలనే విషయంపై నిర్ణయంతీసుకుంటానని ఆయన చెప్పారు. కోర్టుఆగస్టు రెండో తేదీ వరకు గడువుఇచ్చిందని, ఈ లోగా తాను న్యాయవాదులనుసంప్రదిస్తానని ఆయన చెప్పారు.జార్ఖండ్‌రాష్ట్ర సాధన ఉద్యమంలో తానుఉన్నానని, దానికి సంబంధించిన కేసులనుఅన్నింటినీ ఉపసంహరించుకుంటాననియన్‌డి ఎ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీకేసును తిరగదోడారని ఆయనఅన్నారు. భవిష్యత్తు కార్యక్రమంపైతాను తన పార్టీ నాయకులతో చర్చించాల్సివుందని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X