వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై తుది నిర్ణయంహైకమాండ్‌దే

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం/విశాఖపట్నం:ఫైనల్‌లో ప్రభుత్వంతో పీపుల్స్‌వార్‌,జనశక్తి పార్టీల నాయకులే చర్చలుజరుపుతారని పీపుల్స్‌వార్‌ప్రతినిధి, విప్లవ రచయితల సంఘం(విరసం) కార్యవర్గ సభ్యుడువరవరరావు అన్నారు. చర్చలు సెమీఫైనల్‌కు చేరుకున్నాయని హోంమంత్రి కె. జానారెడ్డే అన్నారని,అందువల్ల పీపుల్స్‌వార్‌, జనశక్తిపార్టీ నాయకులే ఫైనల్‌లో చర్చల్లోపాల్గొంటారని ఆయన విలేకరులతోఅన్నారు.

ప్రజలఎజెండా చర్చకు వస్తుందనిఆశిస్తున్నామని ఆయన అన్నారు.మంగళవారంనాడు శ్రీకాకుళం జిల్లాబాతుపురంలో అమరవీరులసంస్మరణ సభకు వచ్చినవరవరరావు కొద్దిసేపువిలేకరులతో మాట్లాడారు.రాజకీయ ప్రచారానికిఅడ్డంకులుండకూడదనిపీపుల్స్‌వార్‌, జనశక్తి పార్టీలుఅభిప్రాయపడుతున్నాయని, తుపాకులులేకుండా ప్రచారంలో పాల్గొనాలనేప్రభుత్వ షరతు ఆ పార్టీలకుసమ్మతం కాదని, ఈ విషయంపై నాలుగోతేదీన తమ వైఖరిని వెల్లడిస్తామనిహోం మంత్రి చెప్పారని అంటూఏమవుతుందో చూద్దామని ఆయనఅన్నారు.కాల్పులవిరమణకు పర్యవేక్షక కమిటీనిఏర్పాటు చేసి వుంటే కోవర్టు సంఘటనలుజరిగి వుండేవి కావని ఆయన అన్నారు.శ్రీకాకుళం బాతుపురం వెళ్తూమధ్యలో విశాఖపట్నంలో కొద్దిసేపు ఆయనవిలేకరులతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలోజరిగిన కోవర్టు సంఘటన,పీపుల్స్‌వార్‌ చేతిలో ఒకరి హత్యఅంశాలను దృష్టిలో వుంచుకొని ఆయన ఆవిధంగా అన్నారు. చంద్రబాబునాయుడుప్రభుత్వ హయాంలో కోవర్టుహత్యలకు పాల్పడిన పోలీసులు ఆఅలవాటును మానుకోలేకపోతున్నారనిఆయన వ్యాఖ్యానించారు. పీపుల్స్‌వార్‌నక్సలైట్లు ఖమ్మం జిల్లా చింతలపాడుగ్రామానికి చెందిన రాఘవులునుకోవర్టు ఆరోపణతో హత్య చేయడాన్నిప్రజా గాయకుడు గద్దర్‌ ప్రస్తావిస్తూఅలా చంపవద్దని పీపుల్స్‌వార్‌కుసూచించారు.శ్రీకాకుళంజిల్లా బాతుపురంలో జరిగినపీపుల్స్‌వార్‌ అమరవీరులసంస్మరణ సభలో వరవరరావు,గద్దర్‌లతో పాటు విప్లవ గాయకుడువంగపండు ప్రసాదరావు, విరసంనేత జి. కళ్యాణరావు కూడాపాల్గొన్నారు. గద్దర్‌, వంగపండుప్రసాదరావు విప్లవ గేయాలుఆలపించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X