వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌కు నాన్‌బెయిలబుల్‌ అరెస్టువారెంటు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తెలంగాణరాష్ట్ర సమితి అధ్యక్షుడు, కేంద్రమంత్రికె. చంద్రశేఖరరావుపై దాఖలైనఛీటింగ్‌ కేసులో హైదరాబాద్‌ ఐదో మెట్రోపాలిటన్‌కోర్టు బుధవారం ఉదయం నాన్‌ బెయిలబుల్‌అరెస్టు వారెంటు జారీ చేసింది. ఎన్నికల సమయంలోటికెట్లు ఆశించేవారి నుంచి దరఖాస్తు ఫీజుగాపదివేల రూపాయల చొప్పున చంద్రశేఖరరావువసూలు చేశారని నల్లపు ప్ల్రద్‌అధ్వర్యంలో బాధితులు కేసువేశారు.

గతంలో కోర్టులో జరిగిన విచారణకుచంద్రశేఖరరావు హాజరు కాలేదు.దీంతో మెజిస్ట్రేట్‌ నాన్‌బెయిలబుల్‌అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేశారు. సెప్టెంబర్‌పదిహేను లోపు కోర్టులో హాజరుకావాలనిమెజిస్ట్రేట్‌ ఆదేశించారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదరని పక్షంలోతెలంగాణలోని మొత్తం నియోజకవర్గాల్లోటీఆర్‌ఎస్‌ సొంతంగా పోటీ చేస్తుందని కేసీఆర్‌ప్రకటించాడనీ, దీంతో తాము డిపాజిట్‌ చేశామనివారు తమ పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈమొత్తం డిపాజిట్‌ను ఆయన పార్టీ జమాలోచేర్చలేదని, సొంతంగానే వాడుకున్నారనికూడా ఆరోపిస్తున్నారు. చంద్రశేఖరరావుప్రస్తుతం న్యూఢిల్లీలో ఉన్నారు.చంద్రశేఖర్‌ రావు తరఫున్యాయవాది వేసిన రికాల్‌ పిటిషన్‌పైకోర్టు గురువారం నిర్ణయంతీసుకుంటుంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X