వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దళసభ్యులపై కాల్పులు జరిపింది లక్ష్మణే:ప్రత్యక్ష సాక్షి

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌:వరంగల్‌ జిల్లా ఒడ్డుగూడెం కాల్పులసంఘటనకు సంబంధించిన ప్రత్యక్షసాక్షి సాత్రాజు శ్రీనివాస్‌తో సహా నలుగురునక్సలైట్లు గురువారం జిల్లా పోలీసుసూపరింటిండెంట్‌ శ్రీనివాస్‌ రెడ్డిముందు లొంగిపోయారు. లొంగిపోయిననలుగురిలో ఇద్దరు పీపుల్స్‌వార్‌దళ సభ్యులు కాగా ఒకరు ప్రజాప్రతిఘటన నక్సలైట్‌ మరొకరుసిపియు ఎస్‌ ఐ నక్సలైట్‌.

వరంగల్‌జిల్లా ఒడ్డుగూడెంలో దళ సభ్యులపైకాల్పులు జరిపింది లక్ష్మణేనని సాత్రాజు శ్రీనివాస్‌విలేకరులతో చెప్పాడు.నిద్రపోతున్న దళ సభ్యులపైలక్ష్మణ్‌ కాల్పులు జరిపి పదకొండు లక్షలరూపాయలతో పారిపోయాడని అతనుతెలిపాడు. లక్ష్మణ్‌ కోవర్టు అవునా, కాదాఅనేది చెప్పలేనని అతను అన్నాడు.వరంగల్‌ జిల్లా ఒడ్డుగూడెంలో లక్ష్మణ్‌తోటి దళ సభ్యులపై జరిపిన కాల్పుల్లోఇద్దరు నక్సలైట్లు మరణించగా,పీపుల్స్‌వార్‌ వరంగల్‌, ఖమ్మం జిల్లాకార్యదర్శి యాదన్న గాయపడ్డవిషయం తెలిసిందే. లక్ష్మణ్‌ కోవర్టు అనిపీపుల్స్‌వార్‌ ఆరోపిస్తోంది. కాగా తానుకాల్పులు జరపలేదని, కాల్పులుజరుగుతున్న సమయంలో తానుఅనుకోకుండా యాదన్న కిట్‌ బ్యాగ్‌తోపారిపోయానని కోర్టులో లొంగిపోయినలక్ష్మణ్‌ చెప్పాడు. కోవర్టు ఆరోపణలపైవిచారణకు పౌర హక్కుల నాయకులుకన్నాభిరాన్‌, బాలగోపాల్‌లతోప్రభుత్వం ఇప్పటికే నిజనిర్ధారణకమిటీ వేసింది.ఒడ్డుగూడెంకాల్పుల సంఘటనపై నిజనిర్ధారణ కమిటీవేయాలని తాము ప్రభుత్వాన్ని కోరామనిఎస్‌పి శ్రీనివాస్‌ రెడ్డి ఈ సందర్భంగావిలేకరులతో చెప్పారు. నిజ నిర్ధారణకమిటీకి తాము పూర్తిగాసహకరిస్తామని కూడా ఆయన అన్నారు.పీపుల్స్‌వార్‌లో అభిప్రాయభేదాలున్నాయని, అందులో భాగంగానేకాల్పులు జరిగాయని, అయితే దీన్నిఒప్పుకోవడానికి వారు సిద్ధంగా లేరనిఆయన అన్నారు.పీపుల్స్‌వార్‌ప్రతినిధులు వరవరరావు,గద్దర్‌, కళ్యాణ్‌ రావులపై పెట్టినకుట్ర కేసు విషయంలో ప్రభుత్వఆదేశాలకు అనుగుణంగావ్యవహరిస్తామని ఆయన చెప్పారు.కేసు విషయం ప్రభుత్వానికితెలియజేశామని ఆయన చెప్పారు.వరంగల్‌ జిల్లా మొగిలిచెర్లలో జరిగినపీపుల్స్‌వార్‌ అమర వీరులసంస్మరణ సభలో మాట్లాడిన తీరుపైవరవరరావు, గద్దర్‌, కళ్యాణ్‌రావులపై పోలీసులు రాజద్రోహం కేసుపెట్టారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X