వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్రఉద్వాసనకు సిపిఐ డిమాండ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు:తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌)నాయకుడు ఎ. నరేంద్రను మంత్రిపదవి నుంచి తప్పించాలని భారతకమ్యూనిస్టు పార్టీ (సిపి ఐ) రాష్ట్రకార్యదర్శి, నల్లగొండ లోక్‌సభసభ్యుడు సురవరం సుధాకర్‌రెడ్డి ప్రధానిని డిమాండ్‌ చేశారు.రాష్ట్రీయ స్వయం సేవక్‌ (ఆర్‌యస్‌యస్‌)తోసంబంధాలున్నందున నరేంద్రనుమంత్రి వర్గం నుంచి తప్పించాల్సినఅవసరం ఉన్నదని ఆయనమంగళవారం విలేకరులతోఅన్నారు.

ఆర్‌యస్‌యస్‌తోనరేంద్ర సంబంధాలను సమర్థిస్తూటి ఆర్‌యస్‌ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కె. చంద్రశేఖర్‌ రావుమాట్లాడడాన్ని ఆయన తప్పు పట్టారు.ఆర్‌యస్‌యస్‌తో సంబంధాలున్నగవర్నర్లను తొలగించిన కేంద్రప్రభుత్వం మంత్రివర్గం నుంచి కూడాఅటువంటి వారిని తొలగించాల్సిన అవసరంఉన్నదని ఆయన అన్నారు.తెలంగాణరాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్‌అధ్యక్షురాలు సోనియా గాంధీ రెండోరాష్ట్రాల పునర్విభజన కమీషన్‌ (ఎస్సార్సీ)కే కట్టుబడి వున్నారని దిగ్విజయ్‌సింగ్‌ చెప్పిన విషయాన్ని సుధాకర్‌ రెడ్డిగుర్తు చేశారు. తెలంగాణవిషయంలో తాము కూడా రెండో ఎస్సార్సీకికట్టుబడి వున్నామని ఆయన చెప్పారు.తెలంగాణకు ఐదు వేల కోట్ల రూపాయలప్యాకేజీ ప్రకటించాలని, ఆరు వందల పదిజీవోను అమలు చేయాలని ఆయన డిమాండ్‌చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X