వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ రాష్ట్రాన్ని సమర్ధించం: ఏచూరి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటునుఎట్టిపరిస్ధితుల్లో సమర్ధించబోమని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యుడుసీతారాం ఏచూరి చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపైపార్లమెంటులో తీర్మానం వంటిదేమైనా ప్రవేశపెడితే అప్పుడుతగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన శుక్రవారంహైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో అన్నారు. తెలంగాణవిషయంలో చంద్రశేఖరరావు చేస్తున్న ప్రకటనలుఅసంబద్ధంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

కేంద్రంలో యుపిఎప్రభుత్వం కనీస ఉమ్మడి కార్యక్రమానికి కట్టుబడి ఉన్నంతవరకు వామపక్షాల నుంచి పేచీ ఉండదని ఆయన అన్నారు.పెట్టుబడుల ఉపసంహరణ, విమానాశ్రయాల ప్రవేటీకరణ, పిఎఫ్‌వడ్డీ రేట్ల తగ్గింపు వంటి అంశాల్లో యుపిఎ ప్రభుత్వంతో తామువిభేదిస్తున్నామని సీతారాం ఏచూరి చెప్పారు. చిటికి మాటికి పెట్రోలియంధరలు పెంచడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. కళంకితమంత్రులను తొలగించమని కోరే నైతిక హక్కు బిజెపికి లేదనిఆయన విమర్శించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X