• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యథావిధిగాపద్మాలయాలో బాలయ్య షూటింగ్‌

By Staff
|
అనంతపురం:కాంగ్రెస్‌ ఆటలు సాగనివ్వమనితెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు హెచ్చరించారు.కాంగ్రెస్‌ దౌర్జన్యాలనుప్రతిఘటిస్తామని ఆయన చెప్పారు.తమ పార్టీ కార్యకర్తల హత్యలకునిరసనగా తెలుగుదేశం పార్టీఅనంతపురం జిల్లా పోలీసుసూపరింటిండెంట్‌ ( ఎస్పీ) కార్యాలయంబుధవారం ఎదుట ధర్నానిర్వహించింది. ఈ ధర్నాను ఉద్దేశించిచంద్రబాబునాయుడు మాట్లాడారు.
విమర్శలుచేసేవారిని కాంగ్రెస్‌ ప్రభుత్వం హత్యచేసేందుకు పూనుకుంటున్నదనిఆయన విమర్శించారు. తమ ప్రాణాలుఅడ్డం పెట్టి పార్టీ కార్యకర్తలనుకాపాడుకుంటామని ఆయన అన్నారు.అనంతపురం జిల్లాలో జరిగినహత్యలను చిన్న విషయాలుగా,వ్యక్తిగత కక్షలుగా ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డికొట్టిపారేయడాన్ని ఆయన తీవ్రంగాతప్పు పట్టారు. ప్రజల ప్రాణాలను,హక్కులను కాపాడాల్సిన బాధ్యతముఖ్యమంత్రిదని ఆయన అన్నారు. ప్రజలప్రాణాలు పోవడం చిన్న విషయమా అనిఆయన అడిగారు.తెలుగుదేశంపార్టీ కోసం పని చేయడమే నేరమాఅని ఆయన అడిగారు. హత్యలకుగురైన తమ కార్యకర్తలకుటుంబాలను ఆదుకుంటామని ఆయన హామీఇచ్చారు. హత్యారాజకీయాలనుకొనసాగిస్తే ప్రజా ఉద్యమంచేపడుతామని ఆయన అన్నారు.కాంగ్రెస్‌ప్రభుత్వ వత్తిళ్లకు లొంగవద్దనిఆయన పోలీసు ఉన్నతాధికారులనుకోరారు. ఒత్తిళ్లకు తలొగ్గిశాశ్వతంగా చెడ్డపేరుతెచ్చుకోవద్దని ఆయన సూచించారు.కాంగ్రెస్‌ పెత్తందారీ పార్టీ అని, సమాజంలోదిగువ శ్రేణికి చెందినవారిని హత్యలుచేస్తోందని ఆయన అన్నారు. తమశాసనసభ్యులు పరిటాల రవి,పయ్యావుల కేశవ్‌, ఎర్రబెల్లిదయాకర్‌ రావు, తదితరులకుతగిన భద్రత కల్పించాలని ఆయనప్రభుత్వాన్ని కోరారు.అనంతపురంజిల్లాలో పది మందిని, మొత్తం రాష్ట్రంలోఇరవై నాలుగు మందిని ఎన్నికలఅనంతరం హత్య చేశారని ఆయనచెప్పారు. ఈ కేసుల విచారణకు ప్రత్యేకకోర్టు పెట్టాలని ఆయన ప్రభుత్వాన్నిడిమాండ్‌ చేశారు.ఈధర్నా కార్యక్రమంలో మాజీమంత్రులు నాగం జనార్దన్‌ రెడ్డి, కోటగిరివిద్యాధరరావు, టి. దేవేందర్‌గౌడ్‌, మాజీ శాసనసభ్యురాలుశోభానాగిరెడ్డి, మాజీ పార్లమెంటుసభ్యుడు బి.కె. పార్థసారథి,శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్‌తదితరులు ప్రసంగించారు. హత్యకుగురైనవారి కుటుంబ సభ్యులు కూడా ఈధర్నా కార్యక్రమానికిహాజరయ్యారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more