• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాలయ్యఇంటి గార్డు హత్య కేసు సిబిఐకిఅప్పగించం

By Staff
|

అనంతపురంజిల్లా హత్యలకు బాధ్యత వహించిముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి రాజీనామా చేయాలనిఆయన డిమాండ్‌ చేశారు. డియస్‌పినిప్రాసిక్యూట్‌ చేయాలని, ఎస్‌పిని, డి ఐజినిసస్పెండ్‌ చేయాలని ఆయన డిమాండ్‌చేశారు. రాయలసీమ ఐజి మీనాను బదిలిచేయాలని కూడా ఆయన డిమాండ్‌ చేశారు.మొత్తం ఏడు డిమాండ్లతో కూడినవినతిపత్రాన్ని గవర్నర్‌కుఅందజేసినట్లు ఆయన తెలిపారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినతర్వాత నూటా పద్నాలుగు రోజుల్లో ఒక్కఅనంతపురం జిల్లాలోనే పదమూడుమంది హత్యకు గురయ్యారని ఆయనచెప్పారు.

అన్నిహత్యలు జరిగినా ముఖ్యమంత్రి ఒక్క సమీక్షాసమావేశం కూడా నిర్వహించలేదని,హైదరాబాద్‌లోని పాతబస్తీ పోలీసుస్టేషన్‌లను తనిఖీ చేశారు గానీఅనంతపురం జిల్లాలో పర్యటించిహత్యలను నివారించే ప్రయత్నంచేయలేదని ఆయన అన్నారు.అనంతపురం జిల్లాలో నరమేథంఆగాలంటే నేర చరిత కలిగిన రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామాచేయాల్సిందేనని ఆయన అన్నారు. మంత్రిజెసి దివాకర్‌రెడ్డి, ఎన్నికల్లో ఓడిపోయినభానుమతి బలమైన తమప్రత్యర్థులను మట్టుబెట్టేకార్యక్రమంలో మునిగిపోయారని ఆయనఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X