వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్‌యస్‌నేత కెసిఆర్‌పై వైయస్‌ ఆగ్రహం

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం/విజయనగరం:తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు,కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్‌రావుమాటలపై వ్యాఖ్యానించడానికి ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డినిరాకరించారు. వారు రోజుకో మాటమాట్లాడుతున్నారని, వారి మాటలపై తానుప్రతిస్పందించడం సరికాదని ఆయనఆదివారం విలేకరుల సమావేశంలోఅన్నారు. శ్రీకాకుళం, విజయనగరంజిల్లాల్లో పల్లెబాట సందర్భంగా జరిగినవిలేకరుల సమావేశంలో ఆయన ఆవిధంగా అన్నారు.

అయితేవిశాఖపట్నం విమానాశ్రయంలో మాత్రంఆయన కెసి ఆర్‌పై తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేశారు. అవసరమైతేతాము సమావేశమై టి ఆర్‌యస్‌తోపొత్తును పునఃపరిశీలించుకుంటామనిఆయన అన్నారు. సోనియా గాంధీపై కెసి ఆర్‌చేసిన వ్యాఖ్యలకు సాధారణ పౌరులేబాధపడుతున్నారని, ఇక కాంగ్రెస్‌కార్యకర్తల మనస్తాపం గురించిచెప్పనవసరం లేదని ఆయనఅన్నారు.ఎవరెన్నిచెప్పినా కాంగ్రెస్‌ తెలంగాణపైరెండవ రాష్ట్రాల పునర్విభజనకమీషన్‌కు కట్టుబడి ఉన్నదని ఆయనఅన్నారు. ఈ విషయాన్ని చంద్రశేఖర్‌ రావుతమతో చేసుకున్న ఒప్పందంలోస్పష్టం పేర్కొన్నట్లు ఆయనవిజయనగరం, శ్రీకాకుళం పల్లెబాటకార్యక్రమం సందర్భంగాఅన్నారు.కాంగ్రెస్‌ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలనునిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటేతెలుగుదేశం అనవసరమైనవిమర్శలు చేస్తోందని ఆయన పల్లెబాటకార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి అన్నారు.రైతులను ఆదుకుంటామని ఆయనచెప్పారు. పోలవరం రెండో దశనుచేపట్టి శ్రీకాకుళం జిల్లాలోని ప్రాంతాలకుసాగు నీరందిస్తామని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X