వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌లోనకిలీ నోట్ల ముఠా అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:నకిలీ నోట్ల తయారీదారుల ముఠానుహైదరాబాద్‌ దక్షిణ మండలంటాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.హైదరాబాద్‌లోని ఈదిబజార్‌లోని ఒక ఇంటినికేంద్రంగా చేసుకొని ఈ ముఠా నకిలీనోట్లను తయారు చేస్తోందనిహైదరాబాద్‌ నగర అసిస్టెంట్‌ పోలీసుకమీషనర్‌ ఖాన్‌ మంగళవారంవిలేకరులతో చెప్పారు.

ఈముఠాకు చెందిన వారు ఇదే నేరంపైజైలు శిక్ష అనుభవించివిడుదలైనవారేనని ఆయన చెప్పారు.ఖలీద్‌, విల్సన్‌ అనే ఇద్దరు చంచల్‌గుడాజైలులోనే నకిలీ నోట్ల తయారీకిపథకం తయారు చేసుకున్నారని,బయటకు వచ్చిన తర్వాత నకిలీ నోట్లుతయారు చేసి మరో ఇద్దరు వ్యక్తులసహకారంతో చెలామణిలోకి తెచ్చేపనికి పూనుకున్నారని ఆయన చెప్పారు.వీరితో పాటు రంగబాబు, విన్సెంట్‌, మహేష్‌అనే వ్యక్తులు కలిసి పని చేశారని ఆయనచెప్పారు. వీరి నుంచి రెండు లక్షలరూపాయల విలువ చేసే నకిలీ నోట్లను,నకిలీ నోట్ల తయారీకి వాడినకంప్యూటర్‌ను పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. గత రెండేళ్లలోపదమూడు నకిలీ నోట్ల తయారీముఠాలను అరెస్టు చేసినట్లు ఖాన్‌చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X