వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహేష్‌కుముందస్తు బెయిల్‌ నో

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌/వరంగల్‌: దౌర్జన్యం, కిడ్నాప్‌కేసుల్లో సినీ నటుడు మహేష్‌ బాబుకుముందస్తు బెయిల్‌ ఇవ్వడానికి రాష్ట్రహైకోర్టు నిరాకరించింది. ఇటీవలవరంగల్‌లో అర్జున్‌ సినిమావిజయోత్సవ సభ సందర్భంగాఅభిమానులను రెచ్చగొట్టే విధంగాప్రవర్తించారని, ఒక వ్యక్తిని కిడ్నాప్‌చేశారని ఆరోపిస్తూ కేసు నమోదైంది. ఈకేసులో ఆయన ముందస్తు బెయిల్‌కుఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు.

మహేష్‌బాబుపైననే కాకుండా దర్శకుడుగుణశేఖర్‌పై, మరో పదిహేడు మందిపైకేసులు నమోదయ్యాయి. వరంగల్‌కోర్టులో లొంగిపోవాలని కూడా హైకోర్టుమహేష్‌బాబును ఆదేశించింది. చట్టాన్ని తనచేతుల్లోకి తీసుకున్నందుకు కేసుపెట్టినట్లు వరంగల్‌ జిల్లా పోలీసుసూపరింటిండెంట్‌ శ్రీనివాస్‌ రెడ్డిచెప్పారు. వీడియో దుకాణాలపై దాడి చేసిధ్వంసం చేయడమే కాకుండా ఒకవ్యాపారిని కిడ్నాప్‌ కూడా చేశారని ఆయనచెప్పారు. ఏదేనా ఉంటే మహేష్‌ బాబుతమకు తెలియజేస్తే తాముసహకరించి వుండేవాళ్లమని ఆయనఅన్నారు.ఇది సినిమాకాదని, జీవితమని ఎస్‌పి వ్యాఖ్యానించారు.కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిన్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చాడని,తమకు ఫిర్యాదు ఏదీ అందలేదనిఆయన చెప్పారు. మహేష్‌బాబునుఅరెస్టు చేయడానికి ఒక బృందాన్నిహైదరాబాద్‌కు పంపేంత పెద్దకేసు కాదని ఆయన అన్నారు. తమకుచాలా పనులు ఉన్నాయని ఆయన చెప్పారు.చార్జిషీటు దాఖలు చేసి తగిన చర్యలుతీసుకుంటామని ఆయన చెప్పారు.వరంగల్‌లోవీడియో షాపులపై దాడి చేసి, ఒక వీడియోషాపు యజమానిని కిడ్నాప్‌ చేశారనేఆరోపణలతో తనపై వరంగల్‌పోలీసులు కేసు నమోదు చేశారనితెలిసిన వెంటనే మహేష్‌ బాబు ఆఆరోపణలు ఖండించారు. వీడియో పైరసీనిఅడ్డుకోవడంలో భాగంగానే తాను ఏమైనాచేశానని, తాను తప్పేమీ చేయలేదనిఆయన చెప్పుకున్నారు. ఆ తర్వాతపైరసీని అరికట్టాలని కోరుతూ ఆయనకొంత మంది సినీ ప్రముఖులతో కలిసిముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డిని కూడా కలిశారు.పైరసీని అరికట్టేందుకు చర్యలుతీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.అయితేదాంతో మహేష్‌ బాబు ఇక్కట్లు తీరినట్లులేదు. తనపై నమోదైన కేసులోఆయన కోర్టుకు హాజరు కావాల్సినఅగత్యంలో పడ్డారు. తెలుగుదేశంప్రభుత్వం మాదిరిగా కాంగ్రెస్‌ప్రభుత్వం సినీ ఆర్టిస్టులకు అన్ని విషయాల్లోఅండదండలు ఇవ్వడం లేదనేది ఈసంఘటన కూడా రుజువు చేస్తున్నది.తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సినీప్రముఖులు ఆడింది ఆట పాడింది పాటగాసాగినందుననే, దాని నుంచి బయటపడలేని సినీ ప్రముఖులు ఆప్పటి లాగానేవ్యవహరిస్తే కష్టాల్లో పడతారని ఈసంఘటన చెప్పకనే చెబుతోంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X