• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రైతులఆత్మహత్యలపై శ్వేతపత్రం: టిడిపిడిమాండ్‌

By Staff
|

హైదరాబాద్‌:రాష్ట్రంలో జరిగిన రైతులఆత్మహత్యలపై శ్వేతపత్రంప్రకటించాలని తెలుగుదేశం నాయకులుకాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. రైతుల, చేనేత కార్మికులఆత్మహత్యలపై ప్రభుత్వంవాస్తవాలను అంగీకరించడానికి సిద్ధంగాలేదని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,కోటగిరి విద్యాధరరావు, డాక్టర్‌ ఎం.వి.మైసురారెడ్డి మంగళవారంవిలేకరుల సమావేశంలో అన్నారు.

కాంగ్రెస్‌ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్నాలువందల తొమ్మిది మంది రైతులు,చేనేత కార్మికులు ఆత్మహత్యలుచేసుకున్నారని వారు చెప్పారు. మూడువందల యాబై మంది మాత్రమేఆత్మహత్యలు చేసుకున్నారనేప్రభుత్వ సమాచారం సరైంది కాదనివారన్నారు. ఆత్మహత్యలు చేసుకున్నరైతుల, చేనేత కార్మికుల పేర్లతోవారు ఒక జాబితాను విడుదల చేశారు.తమ ప్రభుత్వ హయాంలో మూడు వేలమంది రైతులు ఆత్మహత్యలుచేసుకున్నారని కాంగ్రెస్‌ అసత్యప్రచారం చేసిందని వారన్నారు. ఎంతమంది రైతులకు హెల్ప్‌లైన్‌ ద్వారాసాయం అందించారు వంటి వివరాలతోప్రభుత్వ శ్వేతపత్రం విడుదలచేయవలసిన అవసరం ఉన్నదనివారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X