• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కెసిఆర్‌ఆఫీసుపై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడి

By Staff
|

కరీంనగర్‌:కరీంనగర్‌లోని తెలంగాణ రాష్ట్రసమితి (టి ఆర్‌యస్‌) అధ్యక్షుడు,కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్‌ రావుకార్యాలయంపై కాంగ్రెస్‌ కార్యకర్తలుబుధవారం దాడి చేశారు.కార్యాయలంలోని ఫర్నీచర్‌ను,కంప్యూటర్‌ను ధ్వంసం చేశారు.కెసిఆర్‌ తమ నాయకురాలు సోనియాగాంధీకి, ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డికిక్షమాపణ చెప్పేవరకు కార్యాలయాన్నితెరవద్దని సిబ్బందిని హెచ్చరించారు.

అంతకుముందు కాంగ్రెస్‌ పట్టణ కమిటీఆధ్వర్యంలో కరీంనగర్‌లో ర్యాలీ జరిగింది.కెసి ఆర్‌ కార్యాలయం ముందు ధర్నాచేశారు. కెసి ఆర్‌కు, మరో కేంద్రమంత్రి నరేంద్రకు వ్యతిరేకంగానినాదాలు చేశారు. తమ మంత్రిపదవులకు ఇద్దరు టి ఆర్‌యస్‌నాయకులు రాజీనామా చేయాలని వారుడిమాండ్‌ చేశారు. అనంతరంకెసిఆర్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.హటాత్తుగా కెసి ఆర్‌ కార్యాలయంలోకిచొచ్చుకెళ్లి విధ్వంసానికి పాల్పడ్డారు .సోనియాకు, రాజశేఖర్‌ రెడ్డికిబేషరతు బహిరంగ క్షమాపణచెప్పే వరకు కెసిఆర్‌నుకరీంనగర్‌లో అడుగు పెట్టనివ్వబోమనివారన్నారు.విధ్వంసానికిపాల్పడిన ఆరుగురిని పోలీసులు అరెస్టుచేశారు. మరి కొంత మంది కోసంగాలింపు చర్యలు చేపట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X