• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సియంపదవికి వైయస్‌ అనర్హుడు: బాబు

By Staff
|

హైదరాబాద్‌:హత్యలనుఅదుపు చేయలేని డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి పదవికిఅనర్హుడని తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుఅన్నారు. ఉత్తరప్రదేశ్‌ పరిస్థితితో పాటుఆంధ్రప్రదేశ్‌లోని శాంతిభద్రల పరిస్థితినికూడా చూడాని ఆయన గురువారంవిలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరారు.రాజశేఖర్‌ రెడ్డి కడప ఫాక్షన్‌సంస్కృతిని రాష్ట్రమంతటికీవిస్తరింపజేస్తున్నారని ఆయనవ్యాఖ్యానించారు.

అనంతపురంజిల్లాలో హత్యలకు పాల్పడుతున్నబ్లూఫాక్స్‌, జనరక్షణ సమితి ఒక్కటేననిఆయన అన్నారు. జనరక్షణ సమితిసృష్టికర్తలు పోలీసులేనని ఆయనఆరోపించారు. కాంగ్రెస్‌వారికి ఆయుధాలుఎక్కడి నుంచి వస్తున్నాయని ఆయనఅడిగారు. చిత్తశుద్ధి వుంటే హత్యలుచేసినవారిని కనిపెట్టడం కష్టం కాదనిఆయన అన్నారు. తాము వద్దన్నవారికికాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నతపదవులు కట్టబెడుతోందని ఆయనఅన్నారు.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నంత కాలంరైతుల ఆత్మహత్యలు, తమ పార్టీకార్యకర్తల హత్యలు ఆగేట్లు లేవనిఆయన అన్నారు. వైయస్‌ముఖ్యమంత్రిగా వున్నంత కాలంరైతుల ఆత్మహత్యలు జరుగుతూనేవుంటాయని ఆయన అన్నారు. కాంగ్రెస్‌అధికారంలోకి వచ్చిన తర్వాతముప్పై నాలుగు మంది తెలుగుదేశంకార్యకర్తలు హత్యలకుగురయ్యారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X