• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణవిమోచనపై గత పద్ధతే: వైయస్‌

By Staff
|

హైదరాబాద్‌:తెలంగాణ విమోచన దినోత్సవకార్యక్రమం విషయంలో గతప్రభుత్వాల విధానాలనే తాముఅనుసరిస్తున్నామని ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు.తెలంగాణ విమోచన దినోత్సవంసందర్భంగా ఆయన శుక్రవారంసర్దార్‌ వల్లభ్‌ బాయ్‌ పటేల్‌విగ్రహానికి పూలమాల వేసి నివాళులుఅర్పించారు.

తెలంగాణప్రాంతం దేశంలో విలీనమై యాబైయేడు సంవత్సరాలు అవుతోందని, ఈయాబై ఏడేళ్లలో తెలంగాణ విమోచనదినోత్సవాన్ని ఏ విధంగాజరుపుకుంటున్నామో ఇప్పుడు కూడా అదేవిధంగా జరుపుకుంటున్నామని ఆయనఅన్నారు. సర్దార్‌ వల్లభ్‌ బాయ్‌ పటేల్‌చరితార్థుడని, దేశాన్ని ఒకటి చేసినఘనత ఆయనదేనని రాజశేఖర్‌రెడ్డి అన్నారు.ప్రదేశ్‌కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) కార్యాలయంగాంధీభవన్‌లో తెలంగాణ విమోజనదినోత్సవాన్ని కాంగ్రెస్‌ కార్యకర్తలుఘనంగా నిర్వహించారు. పిసిసిఅధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ జాతీయ జెండానుఎగురవేశారు. తెలంగాణ విమోచనసమయంలో ఉనికిలో కూడా లేని పార్టీలుతెలంగాణ విమోచన ఉద్యమచరిత్రకు మతం రంగులుపులమడానికి ఈ రోజు ప్రయత్నిస్తున్నాయనిశ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X