వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనజీవనస్రవంతికి రావాలి: నక్సల్స్‌కువైయస్‌ సూచన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌/వరంగల్‌: తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌) నేత ఎ. నరేంద్ర చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఇష్టం లేకపోతే నరేంద్ర పదవి నుంచి తప్పుకోవచ్చునని వారు అన్నారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరేందుకే వైయస్‌ కన్నా చంద్రబాబునాయుడు నయమని అంటుండవచ్చునని తెలంగాణ కాంగ్రెస్‌ ప్రాంతీయ సమన్వయ కమిటీ (టి ఆర్‌సిసిసి) నాయకులు కె. కేశవరావు, ఎం. కోదండరెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో అన్నారు.

చంద్రబాబునాయుడితో నరేంద్ర కలిసిపోతే తమకేమీ అభ్యంతరం లేదని వారన్నారు. నరేంద్రతో తమకు అవసరం లేదని వారు వ్యాఖ్యానించారు. తెలంగాణ, తెలంగాణ అభివృద్ధి తమకు ముఖ్యమని వారు చెప్పారు. తెలంగాణ అంశాన్ని నరేంద్ర వదిలేసినా తమకు అభ్యంతరం లేదని వారన్నారు. రాజకీయ లబ్ధి కోసం నరేంద్ర ప్రయత్నిస్తున్నారని వారు విమర్శించారు. కిష్టమైన సమస్య వచ్చిన ప్రతిసారీ టి ఆర్‌యస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావు నరేంద్రను ముందుకు తోస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు. ఏ సంబంధం లేకుండా నరేంద్ర ఇందిరాగాంధీ పేరు ప్రస్తావనకు తేవడాన్ని కాంగ్రెస్‌ కోస్తా నాయకులు మరో విలేకరుల సమావేశంలో విమర్శించారు. ఆంధ్రను, తెలంగాణను విడదీయడానికి ఇందిరా గాంధీ ఎప్పుడూ సుముఖంగా లేరని గాదె వెంకటరెడ్డి, గాలి ముద్దు కృష్ణమనాయుడు, తదితరులు అన్నారు. కాంగ్రెస్‌తో కొనసాగడం ఇష్టం లేకపోతే నరేంద్ర తన పదవికి రాజీనామా చేయవచ్చునని వారన్నారు. ఆంధ్రులు దోచుకున్నారని పదే పదే అంటూ నరేంద్ర రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వారు విమర్శించారు. ఇదిలా వుంటే, ముఖ్యమంత్రిపై నరేంద్ర చేసిన వ్యాఖ్యలకు వరంగల్‌ జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వారు నరేంద్ర దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నరేంద్ర కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ఎదుగుదలను సహించక నరేంద్ర విమర్శలు చేస్తున్నారని వారన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X