వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌,టిఆర్‌యస్‌లకు ఆదరణ తగ్గుతోంది:సిపిఐ

By Staff
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌) నాయకులు తాడో పేడో తేల్చుకోవాలంటే తేల్చుకోవచ్చునని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ అన్నారు. ఈ విషయం రాష్ట్ర స్థాయిలో గానీ, పిసిసి స్థాయిలో గానీ లేదని ఆయన అన్నారు. టిఆర్‌యస్‌ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆయన మంగళవారం ఒక ప్రైవేట్‌ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్రంగా మండిపడ్డారు.

ఒక వైపు సిద్ధిపేట ఉప ఎన్నికలో టి ఆర్‌యస్‌ అభ్యర్థి హరీష్‌రావుకు తాము మద్దతు తెలియజేస్తూ గెలుపునకు కృషి చేస్తుంటే టి ఆర్‌యస్‌ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం భావ్యం కాదని ఆయన అన్నారు. సంకల్పం లేకనే టి ఆర్‌యస్‌ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. అవవసరమైన ప్రకటనలు చేస్తూ అయోమయం సృష్టించే ప్రకటనలు చేయడం మానుకోవాలని ఆయన నరేంద్రకు సూచించారు. ఉన్నత స్థాయిలో వ్యవహారం నడుపుతున్నామని చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు వ్యూహాత్మకంగా సాగాలని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు చేరువ కావాలనుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి సంకీర్ణం నుంచి వైదొలగవచ్చునని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X