• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్‌,టిఆర్‌యస్‌లకు ఆదరణ తగ్గుతోంది:సిపిఐ

By Staff
|

హైదరాబాద్‌: నక్సలైట్‌ నేతలతో ప్రభుత్వ చర్చలు మూడు విడతలుగా జరుగుతాయి. నక్సలైట్లతో చర్చలు జరిపే వేదికను సచివాలయం నుంచి జూబిలీహాల్‌కు మార్చడానికి అంగీకరించినట్లు హోం మంత్రి కె. జానారెడ్డి చెప్పారు. పీపుల్స్‌వార్‌ ప్రతినిధులతో విధివిధానాలపై చర్చించిన అనంతరం మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నక్సల్స్‌ ప్రతిపాదనలకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది.

జూబిలీహాల్‌ చర్చలతో మరో రెండు విడతలు నక్సలైట్‌ నాయకులతో చర్చలు జరుపనున్నట్లు ఆయన తెలిపారు. కాగా, చర్చలకు వచ్చే పీపుల్స్‌వార్‌ నేతలు గుంటూరు జిల్లా గుత్తికొండ బిలం బహిరంగ సభలో పాల్గొంటారు. పదకొండవ తేదీన జరిగే ఈ సభలో ప్రభుత్వంతో చర్చలు జరిపే జనశక్తి నాయకులు అమర్‌, రియాజ్‌లు కూడా పాల్గొంటారు. ఈ నెల పదమూడవ తేదీన ఖమ్మం జిల్లా పగిడేరులో జరిగే జనశక్తి సభలో అమర్‌, రియాజ్‌ పాల్గొంటారు. ఈ సభకు పీపుల్స్‌వార్‌ నేతలు రామకృష్ణ, సుధాకర్‌, గణేష్‌ కూడా హాజరవుతారు. ఇరు పార్టీల నక్సలైట్‌ నేతలకు పదిహేనవ తేదీన చర్చల్లో పాల్గొనడానికి హైదరాబాద్‌ వస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X