వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌,టిఆర్‌యస్‌లకు ఆదరణ తగ్గుతోంది:సిపిఐ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కాంగ్రెస్‌, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్‌)ల మధ్య విభేదాలు లేవని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఎఐసిసి) కార్యదర్శి జయకుమార్‌ స్పష్టం చేశారు. ఆసిఫ్‌నగర్‌, సిద్ధిపేట శాసనసభా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన బుధవారం హైదరాబాద్‌ వచ్చారు.

ఉప ఎన్నికల తీరుతెన్నులను ఆయన గాంధీభవన్‌లో పార్టీ నాయకుల సమావేశంలో సమీక్షించారు. కాంగ్రెస్‌కు, టి ఆర్‌యస్‌కు మధ్య చిన్న పాటి గొడవలను తమ పార్టీ అధిష్ఠాన వర్గం ఇప్పటికే పరిష్కరించిందని, ప్రస్తుతం ఏ విభేదాలూ లేవని ఆయన అన్నారు. తాను సిద్ధిపేటలో టి ఆర్‌యస్‌ అభ్యర్థి హరీష్‌రావు విజయానికి ప్రచారం చేస్తానని, ఆసిఫ్‌నగర్‌ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటానని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X