• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్‌,టిఆర్‌యస్‌లకు ఆదరణ తగ్గుతోంది:సిపిఐ

By Staff
|

హైదరాబాద్‌: పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ప్రభుత్వ అడ్వొకేట్‌ జనరల్‌ కోరిక మేరకు హైకోర్టు విచారణను ఈ నెల పదకొండవ తేదీకి వాయిదా వేసింది.

పర్యావరణ అనుమతి లేకుండా పులిచింతల నిర్మాణం కూడదంటూ హైకోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలైంది. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగించాలని కోరుతూ కృష్ణా డెల్టా పరిరక్షణ సమితి దావా వేసింది. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావు చేసిన ప్రకటనను కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సియల్‌పి) తీవ్రంగా తప్పు పట్టింది. కెసి ఆర్‌ ప్రకటన దుర్మార్గమైందని కాంగ్రెస్‌ శాసనసభ్యులు గాలి ముద్దు కృష్ణమనాయుడు, తదితరులు వ్యాఖ్యానించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టిఆర్‌యస్‌ వ్యతిరేకించడం సరైంది కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X