• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్‌,టిఆర్‌యస్‌లకు ఆదరణ తగ్గుతోంది:సిపిఐ

By Staff
|

హైదరాబాద్‌: ప్రభుత్వానికి, నక్సలైట్లకు మధ్య జరుగుతున్న చర్చల్లో రాజకీయ పార్టీలకు, మేధావులకు కూడా స్థానం కల్పించాలని తెలుగుదేశం సీనియర్‌ నాయకుడు చెన్నమనేని రాజేశ్వరరావు కోరారు. దీని వల్ల సామాజిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో అభిప్రాయపడ్డారు. నక్సల్స్‌, ప్రభుత్వ ప్రతినిధులకే కాకుండా ఇతర రాజకీయ పార్టీల నాయకులకు, మేధావులకు చర్చల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

తాము నక్సలైట్లతో చర్చలకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. చర్చల ఎజెండాలో ఉన్నవి ఆర్థిక, సామాజిక అంశాలే అయినందున ఈ అవకాశాన్ని ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. శాంతిభద్రతలకు, అభివృద్ధికి ప్రతిబంధకంగా తయారైన సమస్య పరిష్కారానికి చర్చలు ఉపయోగపడవగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. చర్చల విషయంలో హోం మంత్రి కె. జానారెడ్డి వ్యవహరిస్తున్న తీరును ఆయన అభినందించారు. చర్చలు ఒకరినొకరు మోసం చేసుకోవడానికి జరుగుతున్నాయనే అపోహలను వదిలేసి చిత్తశుద్ధితో వ్యవహరించడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్థిక కార్యక్రమాలను, సంస్కరణలను ప్రభుత్వం వేగవంతం చేయడానికి చర్చలను ఉపయోగించుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X