వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌,టిఆర్‌యస్‌లకు ఆదరణ తగ్గుతోంది:సిపిఐ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తాము పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి కట్టుబడి వున్నామని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి స్పష్టం చేశారు. మానసికంగా బలహీనులైనవారికి కౌన్సెలింగ్‌ నిర్వహించే ఒక సంస్థ సక్సెస్‌ ఫోరమ్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఇక్కడ రైతులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

నాగార్జునసాగర్‌ నుంచి సాగు నీరు విడుదల చేయించాలని కోరుతూ మంగళవారం ఒంగోలు కలెక్టరేట్‌ ముట్టడి ఘటనపై తెలుగుదేశం పార్టీ తీరును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. పోలీసుల లాఠీచార్జీలో గాయపడింది రైతులు కాదని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఆయన అన్నారు. ఏదో విధంగా గొడవలు సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. గొడవలు చేయకపోతే కార్యకర్తలు నిలబడరని చంద్రబాబు భయపడుతున్నారని ఆయన అన్నారు. ధర్నాలు, ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టవచ్చునని, అయితే కలెక్టర్‌ ఇంటిపై దాడి చేయడం, అందునా మహిళా కలెక్టర్‌ ఇంటిపై దాడి చేయడం, రాళ్లు రువ్వడం సరైంది కాదని ఆయన అన్నారు. తాము జూన్‌ ఒకటవ తేదీ వరకు నీరిచ్చామని, ఆడుతరి పంటలు వేసుకోవాలని తాము జూన్‌ రెండో తేదీన రైతులకు సూచించామని ఆయన చెప్పారు. నీళ్లుంటే నీళ్లు ఇస్తామని ప్రజలకు తెలుసునని, ఈ విషయం తెలుగుదేశం పార్టీకి కూడా తెలుసునని, అయితే ఏదో గొడవ చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం దీనికి పాల్పడిందని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X