వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనజీవనస్రవంతికి రావాలి: నక్సల్స్‌కువైయస్‌ సూచన

By Staff
|
Google Oneindia TeluguNews

ముల్తానాబాద్‌: పాకిస్థాన్‌లోని ముల్తాన్‌ నగరంలో గురువారం జరిగిన రెండు బాంబు పేలుడు సంఘటనల్లో ముప్పై తొమ్మిది మంది మరణించారు. పంజాబ్‌ ప్రొవిన్స్‌లోని ముల్తాన్‌ నగరంలో సున్నీ అతివాద సంస్థ సిఫా - ఎ - సెహబా ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీకి కొద్ది దూరంలో రెండు సార్లు బాంబు పేలుళ్లు సంభవించాయి.

ఊరేగింపులో పాల్గొన్నవారు ఇళ్లకు తిరిగి వెళ్తుండగా మొదట ఒక కారు బాంబు పేలింది. ఆ వెంటనే ఒక మోటార్‌ సైకిల్‌ లో పెట్టిన బాంబు పేలింది. ఈ సంఘటనలో ముప్పై తొమ్మిది మంది మరణించగా, వంద మందికి పైగా గాయపడ్డారు. యాబై మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సిఫా - ఎ - సెహబా వ్యవస్థాపకుడు ఆజమ్‌ తారిఖ్‌ స్మారకార్థం ఊరేగింపు, బహిరంగ సభ జరిగాయి. తారిఖ్‌ నిరుడు తుపాకితో కాల్చి చంపారు. బాంబులను రిమోట్‌ కంట్రోల్‌ సహాయంతో పేల్చారు. ఆత్మాహుతి బాంబర్లు ఈ పని చేయలేదు. ఈ సంఘటనతో షియాలపై దాడులు జరిగే ప్రమాదం ఉన్నందున ముల్తాన్‌లో పోలీసు నిఘాను పెంచారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X