వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనజీవనస్రవంతికి రావాలి: నక్సల్స్‌కువైయస్‌ సూచన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించినఅంతర్జాతీయ పరిశీలకుల బృందంసభ్యుడిగా శ్రీకాకుళం జిల్లా మామిడివలసకుచెందిన కె. జగన్నాథ రావు ఎంపికయ్యారు.చరిత్రలో తొలిసారిగా అంతర్జాతీయ పరిశీలకులసమక్షంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌ 2న జరుగనున్నాయి.

కె.జెరావుభారత ఎన్నికల సంఘంలో సలహాదారుగా ఉన్నారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అంతర్జాతీయపరిశీలకుల బృందంలో రావు పేరు కూడా చోటుచేసుకున్న విషయం మొదటగా ఆయనకుమార్తె మాధవీ లతకు తెలిసింది. రావు ప్రస్తుతంఅధికారిక పనుల నిమిత్తం అఫ్ఘానిస్తాన్‌లో ఉన్నారు.మాధవీ లత తనకు తెలిసిన విషయంనిజమో, కాదో ధ్రువీకరించుకోవలసిందిగా రావుకుఫోన్‌ చేసి చెప్పారు.

ఆయన అమెరికాలోనిసంబంధిత అధికారులకు ఫోన్‌ చేయగా,అంతర్జాతీయ పరిశీలకుల బృందంలో ఆయనపేరు ఉన్నట్టు వారు తెలిపారు. ఇది నిజంగాఆయనకు దక్కిన గౌరవం, నాకు చాలాసంతోషంగా ఉంది అని రావు సతీమణి జగదీశ్వరిఅంటున్నారు. విశాఖపట్టణంలోని ఎవిఎన్‌ డిగ్రీ కళాశాలలోగ్రాడ్యుయేషన్‌ చేసిన కె.జగన్నాథ రావుప్రభుత్వోద్యోగిగా గత ముప్పైఐదేళ్ళుగా ఢిల్లీలో ఉంటున్నారు.

జార్జిబుష్‌,జాన్‌ కెర్రీల మధ్య ప్రధాన పోటీ నెలకొన్నఅమెరికా అధ్యక్ష ఎన్నికలు రెండు అంతర్జాతీయపరిశీలకుల బృందాల సమక్షంలో జరుగనున్నాయి.శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన మానవ హక్కులసంస్థ గ్లోబల్‌ చేంజ్‌ వీటిలో ఒక బృందానికిరావును ఎంపిక చేసింది.

యూరోపులోభద్రత,సహకారానికి సంబంధించిన సంస్థ మరోబృందాన్ని ఎంపిక చేస్తుంది. భారతదేశంనుంచి కె.జె.రావుతో పాటు, నీరజా చౌదరి కూడాపరిశీలకుల బందంలో ఉన్నారు. అఫ్ఘానిస్తాన్‌ నుంచి తిరిగి వచ్చిన తరువాత రావు ఈనెలలో అమెరికాకు వెళతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X