• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మహారాష్ట్రలోకాంగ్రెస్‌-ఎన్‌సిపి విజయం

By Staff
|

చినఆరుట్ల: చర్చలు కొనసాగినంత కాలంఆయుధాలు పట్టబోమని పీపుల్స్‌వార్‌ రాష్ట్రకమిటీ కార్యదర్శి అక్కిరాజు హరగోపాల్‌అలియాస్‌ రామకృష్ణ ( ఆర్కే)విలేకరులతో చెప్పారు. నల్లమలఅడవుల్లోంచి బయటకు వచ్చినఅనంతరం ఆయన కొద్ది సేపువిలేకరులతో మాట్లాడారు. చర్చలప్రక్రియ సాగినంత కాలం తనతో పాటుబయటకు వచ్చిన గార్డులు తమ వెంటఉంటారని ఆయన చెప్పారు.

ప్రభుత్వంతోజరిగే తొలి విడత చర్చలు మూడు నాలుగురోజులు ఉండవచ్చునని, బహుశాఇరవయ్యవ తేదీ వరకుసాగవచ్చునని, అంత వరకు తాముహైదరాబాద్‌లోనే ఉంటామని ఆయనచెప్పారు. తమ రక్షణ బాధ్యతప్రభుత్వానిదేనని, తమకు ఎస్కార్ట్‌నుఇస్తామని ప్రభుత్వం చెప్పిందని ఆయనఅన్నారు. హైదరాబాద్‌లో తాముప్రభుత్వం చూపిన హౌస్‌లో ఉంటామనిఆయన చెప్పారు.హైదరాబాద్‌లోతాము ఏ రాజకీయ పార్టీల నాయకులనుకూడా కలవబోమని, వామపక్షాలనేతలతో కూడా ఈ తడవ సమావేశంకాబోమని ఆయన చెప్పారు. అయితే విశాలప్రజానీకాన్ని, ప్రజల ప్రతినిధులనుకలుసుకుంటామని ఆయన చెప్పారు.మూడు విడతలు ప్రభుత్వంలో చర్చలుఉంటాయని, అవసరమైతే పొడిగిస్తామనిఆయన చెప్పారు.చర్చల్లోప్రధానమైన రాజకీయ సమస్యలుప్రధానమవుతాయని, ప్రపంచ బ్యాంక్‌ఆర్థిక విధానాలకు స్వస్తి చెప్పడం,భూస్వాముల భూములను పేదలకుపంచడం అనేవి ప్రధానమైనవనిఆయన అన్నారు. ప్రజల రాజకీయ, ఆర్థిక,సామాజిక అంశాలు చర్చలో ప్రధాన భూమికవహిస్తాయని, రాజకీయ సమస్యలమీదనే తాము దృష్టి కేంద్రీకరిస్తామని,ప్రజా సమస్యలు వాటితో ముడిపడివున్నవేనని ఆయన అన్నారు.తాముఆశావహంతో చర్చలకువస్తున్నామని, ప్రభుత్వం ప్రజలసమస్యలు పరిష్కరించకపోతే తమ దారితమకు ఉండనే ఉన్నదని ఆయనఅన్నారు. దీర్ఘకాలిక పోరాటంసాగిస్తామని ఆయన చెప్పారు.పీపుల్స్‌వార్‌ నేతలతో పాటు జనశక్తినేతలు అమర్‌, రియాజ్‌లు కూడావిలేకరులతో మాట్లాడారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X