• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐఎఎస్‌ అధికారి బర్తరఫ్‌కుములాయం సిఫార్సు

By Staff
|

హైదరాబాద్‌:ప్రభుత్వ నిర్ణయాల మీదనేభవిష్యత్తు ఆధారపడి ఉంటుందనిపీపుల్స్‌వార్‌ రాష్ట్ర కమిటీ కార్యదర్శిఅక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌రామకృష్ణ అన్నారు. ప్రపంచ ఆర్థికవిధానాలకు స్వస్తి, దున్నే వానికి భూమివిషయాల్లో ప్రభుత్వం తీసుకునేనిర్ణయాల మీదనే ఆ భవిష్యత్తుఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టులసంఘం ( ఎపియుడబ్ల్యుజె)మంగళవారం మంజీరా అతిథి గృహంలోఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌కార్యక్రమంలో ఆయనతో పాటు జనశక్తిరాష్ట్ర కమిటీ కార్యదర్శి అమర్‌మాట్లాడారు. విలేకరులు అడిగిన వివిధప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

కాంగ్రెస్‌ప్రభుత్వాల హయాంలలోనే ప్రపంచబ్యాంక్‌ అనుకూల ఆర్థిక విధానాలుప్రారంభమయ్యాయని, భూసంస్కరణలుసరిగా అమలు కాలేదని, ప్రస్తుతప్రభుత్వం వాటిని పరిష్కరిస్తుందా లేదాఅనే దాని మీదనే భవిష్యత్తు ఆధారపడిఉంటుందని, పరిష్కరించకపోతే ప్రజలప్రతిఘటన తప్పదని రామకృష్ణఅన్నారు. ప్రజల ఆకాంక్షలను దృష్టిలోపెట్టుకొని విశ్వాసంతోనే చర్చలకు వచ్చామనిఆయన చెప్పారు.తమపోరాటాన్ని సాయుధంగా నిర్మూలించాలనిపూనుకుంటే ప్రజలకుదూరమవుతామనే ఉద్దేశంతోనేకాంగ్రెస్‌ ప్రభుత్వం చర్చలకుముందుకు వచ్చిందని ఆయన అన్నారు.చర్చల కోసం ఈ ప్రభుత్వం కొన్నిప్రజాస్వామిక చర్యలను కూడాచేపట్టిందని ఆయన అన్నారు. ప్రజలఆకాంక్షలను గత చంద్రబాబునాయుడుసహజంగానే తీర్చలేదని, ఇందులోభాగంగానే చర్చలకు ఆటంకంకలిగించారని, వీటన్నింటి వల్లచంద్రబాబునాయుడు ఎన్నికల్లోఓడిపోయారని ఆయన వివరించారు.ప్రజల,మేధావుల ఆకాంక్షల మేరకు, గతముప్పై యేళ్ల పోరాట ఫలితంగాప్రభుత్వం తమను చర్చలకుఆహ్వానించిందని అమర్‌ అన్నారు. ప్రజలఆకాంక్షల మేరకు రాజకీయడిమాండ్లను ప్రభుత్వం ముందుపెడతామని ఆయన చెప్పారు.ప్రజలుసాయుధ పోరాటాన్నే కోరుతున్నారనిఒక ప్రశ్నకు సమాధానంగారామకృష్ణ అన్నారు. పార్టీ వైఫల్యంవల్లనే తెలంగాణ సాయుధ పోరాటంవిఫలమైందని, భారత సైన్య బలం వల్లకాదని, అంతిమంగా ప్రజలదే విజయంఅవుతుందని ఆయన మరో ప్రశ్నకుసమాధానంగా చెప్పారు. పార్టీని గానీ,క్యాడర్‌ను గానీ లీగల్‌ చేయాలనిప్రత్యేకంగా ఏమీ లేదని, పనుల వల్లకొందరు బయటకు వచ్చారని, బయటఉన్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వస్వభావాన్ని బట్టే సమస్యల పరిష్కారంఉంటుందని, పరిష్కారం అసాధ్యమయ్యేసమస్యలేవీ ఉండవని ఆయనఅన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more